ఆదిలాబాద్ రూరల్, న్యూస్‌లైన్ : ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు డ బ్బు, మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఎన్నికల సం ఘం నియమించిన నిఘా విభాగం నిద్రావస్థలో ఉం ది. మద్యం, డబ్బు పంపిణీ ప్రవహాన్ని అడ్డుకోవడం లో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఎన్నికల ఖర్చును నియంత్రించడానికి ఏర్పాటు చేసిన నిఘా విభాగం అభ్యర్థుల సొమ్మును స్వాధీనం చేసుకోలేకపోతోంది. ఇప్పటివరకు మండలంలో అమాయకుల సొమ్మును స్వాధీనం చేసుకున్నా నిఘా విభాగం అధికారులు అ భ్యర్థులు తరలిస్తున్న సొమ్ముపై దృష్టి సారించడం లే దనే విమర్శలున్నాయి. దీంతో ఓటర్లను ప్రలోభపెట్టి ఓట్లు రాబట్టేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
మండలాల వారీగా అధికారులున్నా..
జిల్లాలో ఈ నెల 6, 11వ తేదీల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఖర్చుపై కట్టుదిట్టమైన పర్యవేక్షణ ఏర్పాటు చేసినా జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకునేందుకు మండలాల వా రీగా ఆర్వోలను నియమించింది. దీంతోపాటు ఎన్నిక ల యంత్రాంగం నియోజకవర్గ, మండల స్థాయి నిఘా బృందాలను ఏర్పాటు చేసింది. నియోజకవర్గ స్థాయిలో సహాయ వ్యయ పరిశీలకులు(ఏఈవో), వీడియో సర్వైవల్ టీం, వీడియో వ్యూయింగ్ టీం, అ కౌంటింగ్ టీం, మండల స్థాయిలో ఫ్లయింగ్ స్క్వాడ్(ఎఫ్‌ఎస్), స్టాటిక్ సర్వైలెన్స్ టీం(ఎస్‌ఎస్‌టీ), మోడ ల్ కోడ్ టీం, సెక్టోరల్ టీం పనిచేస్తున్నాయి. వీటిలో వీడియో వీడియో వ్యూయింగ్ టీం, అకౌంట్ టీంలు కార్యాలయంలోనే పనిచేస్తాయి. ఫ్లయింగ్ స్క్వాడ్ టీం, సెక్టోరల్, వీడియో సర్వైవల్ టీంలు అభ్యర్థుల క దలికలపై నిఘా వేస్తుంటాయి. అభ్యర్థులు ఓట్ల వేట లో ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారు. కనిపించిన వారినల్లా ప్రలోభాలకు గురిచేసే పనిలో పడ్డారు.
జోరుగా మద్యం ..
మందు మద్యం నిల్వ చేసి కొందరికి ఎర చూపి తమ వెంట ప్రచారంలో తిప్పుకుంటున్నారు. అయినా అభ్యర్థుల కదలికలపై నిఘా పెట్టాల్సిన అధికారులు నిద్రమత్తులో జోగుతున్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం లాంటి ప్రలోభాలకు గురిచేస్తే చర్యలుంటాయాని ఎన్నికల అధికారులు గ్రామాల్లో ఓటు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి హెచ్చరిస్తున్నారు. అవేమీ పట్టన్నట్లుగా రాజకీయ నాయకులు, అభ్యర్థులు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లను పంచేందుకు వివిధ మార్గాల ద్వారా ఇప్పటికే అవసరమైన డబ్బు సమాకుర్చుకున్నట్లు తెలుస్తోంది. కొందరు మద్యం బాటిళ్ల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైనా నిఘా విభాగం అధికారులు నిద్రమత్తు వీడి ప్రలోభాలకు గురిచేసే అభ్యర్థులపై నిఘా వేయాల్సి ఉంది.
మద్యం, డబ్బు పంపిణీ పై అధికారులు నిర్లక్ష్యం
Published Sat, Apr 5 2014 12:39 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement