లోకేష్‌ను కలిసిన ధూళిపాళ్ల
అమరావతి: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో మంత్రి నారా లోకేష్‌ను పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కలుసుకున్నారు. మంత్రివర్గంలో చేరిక, కీలక శాఖలు దక్కడంపై లోకేష్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నరేంద్రకు మంత్రి పదవి దక్కని అంశంపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రిపదవి పొందేందుకు మీకు పూర్తి అర్హత ఉంది, కానీ సమీకరణల్లో సాధ్యపడలేదు అని ధూళిపాళ్లతో వ్యాఖ్యానించినట్లు, ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.