ధూళిపాళ్ల, చాంద్‌బాషాకు ఘోర పరాభవం! | chandrababu naidu gives no appointment to dhulipalla, chandbasha | Sakshi
Sakshi News home page

ధూళిపాళ్ల, చాంద్‌బాషాకు ఘోర పరాభవం!

Published Mon, Apr 3 2017 2:48 PM | Last Updated on Mon, Jul 23 2018 7:01 PM

ధూళిపాళ్ల, చాంద్‌బాషాకు ఘోర పరాభవం! - Sakshi

ధూళిపాళ్ల, చాంద్‌బాషాకు ఘోర పరాభవం!

విజయవాడ: కేబినెట్‌లో చోటుదక్కని టీడీపీ నేతలకు అవమానాలు, పరాభవాలే మిగులుతున్నాయి. టీడీపీ సీనియర్‌ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఆ పార్టీ అనుచితంగా ప్రవర్తించింది. మంత్రి పదవి రాలేదని తీవ్ర నిర్వేదంలో ఉన్న ఆయనతో కనీసం మాట్లాడేందుకు కూడా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. ఇతర అసంతృప్తులను పిలిచి మాడ్లుతున్నా...ధూళ్లిపాళ్లను మాత్రం సీఎం ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా...బుజ్జగించేందుకు కూడా యత్నించలేదు.

మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని, పార్టీ అధికారంలో లేనప్పుడు తాను చేసిన సేవను ధూళిపాళ్ల గుర్తు చేసినప్పటికీ చంద్రబాబు నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు.ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కనబెట్టి.. పక్కపార్టీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడంపై ఆయన అలకబూనారు.   ఓ వైపు అధినేత చంద్రబాబు, మరోవైపు నారా లోకేశ్‌ వైఖరితో ధూళిపాళ్ల కుమిలిపోతున్నట్లు సమాచారం.

ఇక వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చాంద్‌ బాషాకు ఘోర పరాభవం ఎదురైంది. మంత్రి పదవిని ఆశించిన ఆయన సీఎంను కలిసేందుకు సోమవారం యత్నించారు. అయితే చంద్రబాబు మాత్రం.. చాంద్‌ బాషాకు అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వలేదు. మైనార్టీకోటాలో చివరి నిమిషం వరకూ చాంద్‌బాషాకు మంత్రి పదవిని ఊరించినా, చివరికి నిరాశే మిగిలింది. దీంతో సీఎం ఇంటికొచ్చినా ముఖ్యమంత్రిని కలవకుండానే చాంద్‌బాషా వెనుదిరిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement