mla chandbasha
-
ధూళిపాళ్ల, చాంద్‌బాషాకు ఘోర పరాభవం!
విజయవాడ: కేబినెట్లో చోటుదక్కని టీడీపీ నేతలకు అవమానాలు, పరాభవాలే మిగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై ఆ పార్టీ అనుచితంగా ప్రవర్తించింది. మంత్రి పదవి రాలేదని తీవ్ర నిర్వేదంలో ఉన్న ఆయనతో కనీసం మాట్లాడేందుకు కూడా పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టపడలేదు. ఇతర అసంతృప్తులను పిలిచి మాడ్లుతున్నా...ధూళ్లిపాళ్లను మాత్రం సీఎం ఏమాత్రం పట్టించుకోలేదు సరికదా...బుజ్జగించేందుకు కూడా యత్నించలేదు. మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని, పార్టీ అధికారంలో లేనప్పుడు తాను చేసిన సేవను ధూళిపాళ్ల గుర్తు చేసినప్పటికీ చంద్రబాబు నుంచి ఆయనకు ఎలాంటి హామీ లభించలేదు.ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడ్డవారిని పక్కనబెట్టి.. పక్కపార్టీ నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేయడంపై ఆయన అలకబూనారు. ఓ వైపు అధినేత చంద్రబాబు, మరోవైపు నారా లోకేశ్ వైఖరితో ధూళిపాళ్ల కుమిలిపోతున్నట్లు సమాచారం. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, అనంతరం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే చాంద్ బాషాకు ఘోర పరాభవం ఎదురైంది. మంత్రి పదవిని ఆశించిన ఆయన సీఎంను కలిసేందుకు సోమవారం యత్నించారు. అయితే చంద్రబాబు మాత్రం.. చాంద్ బాషాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మైనార్టీకోటాలో చివరి నిమిషం వరకూ చాంద్‌బాషాకు మంత్రి పదవిని ఊరించినా, చివరికి నిరాశే మిగిలింది. దీంతో సీఎం ఇంటికొచ్చినా ముఖ్యమంత్రిని కలవకుండానే చాంద్‌బాషా వెనుదిరిగారు. -
నర్సుపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
-
నర్సుపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
అనంతపురం : రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. తాజాగా అనంతలో టీడీపీ నేత లైంగిక వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. నల్లచెరువు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న యువతిని ఆస్పత్రి కమిటీ చైర్మన్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ అంశంపై బాధితురాలు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదు. పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న యువతి(23)ని స్థానిక టీడీపీ నాయకుడు, ఆస్పత్రి కమిటీ చైర్మన్ రియాజ్‌ఖాన్(42) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఆస్పత్రికి వచ్చిన రియాజ్ ఖాన్ స్టాఫ్నర్స్తో అసభ్యంగా ప్రవర్తించాడు. తన మాట వినకపోతె ట్రాన్స్ఫర్ చేయిస్తానని.. ఉద్యోగంలో నుంచి తీయిస్తానని బెదిరించాడు. దీంతో ఆవేదనకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రియాజ్ఖాన్కు ఎమ్మెల్యే చాంద్‌బాషా మద్దతు ఉందని అందుకే అతను ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
మహిళను వివస్త్రను చేసి చెప్పులతో దాడి..
- ఎమ్మెల్యే చాంద్‌బాషా అనుచరుడి దాష్టికం కదిరి: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతలు, వారి అనుచరుల ఆగడాలు రోజురోజుకీ మితిమీరిపోతున్నాయి. నెల క్రితం రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయి బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై కిరాతకంగా దాడి చేశారు. అప్పట్లో బయటపడ్డ పరిటాల అనుచరుల దాడి దృశ్యాలపై సర్వత్రా చర్చ జరిగింది. అది మరువక ముందే తాజాగా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా అనుచరుడు ఓ మహిళపై తన దాష్టికాన్ని ప్రదర్శించాడు. చాంద్ బాషా అనుచరుడు రేషన్ నారాయణ, అతని అనుచరులు ఓ మహిళను వివస్త్రను చేసి చెప్పులతో దాడి చేశాడు. దీంతో సదరు మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. నారాయణ దాడితో మనస్థాపం చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు మహిళ బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ సంఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంత్రిపై ఎమ్మెల్సీ ఫైర్
మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఎమ్మెల్సీ శమంతకమణి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ సమన్వయ కమిటీల సమావేశాల్లో నేతలు ధిక్కార స్వరాన్ని వినిపించారు. సోమవారం అనంతపురంలోని కమ్మభవన్‌లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీల సమావేశాలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సాగాయి. ఈ సందర్భంగా జిల్లా పరిశీలకుడు జయనాగేశ్వరరెడ్డి, మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథరెడ్డి ఎదుట పలువురు నేతలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సమావేశాలకు మీడియాను అనుమతించలేదు. కొందరు నేతలు బయటకు వచ్చాక నేతల తీరును బాహాటంగానే విమర్శించారు. కదిరి ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా తీరుపై నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట నేతృత్వంలో నేతలు ఆగ్రహించారు. స్టోర్ డీలర్లను తొలగించాలని, జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని ఎమ్మెల్యే చెబుతున్నట్లు జయనాగేశ్వరరెడ్డికి ఫిర్యాదు చేశారు. పార్టీలో ఉంటూ ప్రొటోకాల్ పేరిట వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతున్నారన్నారు. ఇక ఎమ్మెల్సీ శమంతకమణి తనదైన శైలిలో మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో.. ఎవరు చేయలేదో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్ల ఎంపికలో తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకున్నారని మండిపడ్డారు. దీంతో ఎవరి విషయంలో మాట్లాడుతున్నారని జయనాగేశ్వరరెడ్డి అడగ్గా.. వడ్డెర్ల కార్పొరేషన్ చైర్మన్‌గా మురళీని ఎవరిని అడిగి ఎంపిక చేశారని ప్రశ్నించారు. దీంతో మంత్రి పల్లె తానే వేయించానని చెప్పారు. ‘నువ్వొక్కడివే ఎలా నిర్ణయం తీసుకుంటావ’ని ఆమె ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి సునీత కూడా తనకు సమాచారం లేదన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, మరికొందరు కూడా గళం విప్పారు. ఉక్కిరిబిక్కిరైన మంత్రి పల్లె.. అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని అడిగే ఇచ్చామని చెప్పారు. ఇవ్వాలా, వద్దా అని అడిగితే ఇవ్వండని చెప్పినట్లు చౌదరి అంగీకరించారు. గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కొంత మంది నాయకులు కొన్ని సమావేశాల్లో మాత్రమే కన్పిస్తున్నారని, పార్టీ కోసం పని చేయడం లేదని అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశంలోనూ మంత్రి పల్లెపై ఫిర్యాదులు వెళ్లాయి. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి అడ్డుపడుతున్నారని, ప్రత్యేక వర్గాన్ని పెంచిపోషిస్తూ పార్టీ కోసం కష్టపడిన వారిని పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు ఫిర్యాదు చేశారు. మొత్తానికి చాలా నియోజకవర్గాల్లో అసంతృప్తి జ్వాల రగలగా.. నేతలు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.