నర్సుపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
అనంతపురం : రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. తాజాగా అనంతలో టీడీపీ నేత లైంగిక వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది.
నల్లచెరువు పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న యువతిని ఆస్పత్రి కమిటీ చైర్మన్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ అంశంపై బాధితురాలు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదు. పీహెచ్‌సీలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న యువతి(23)ని స్థానిక టీడీపీ నాయకుడు, ఆస్పత్రి కమిటీ చైర్మన్ రియాజ్‌ఖాన్(42) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఆస్పత్రికి వచ్చిన రియాజ్ ఖాన్ స్టాఫ్‌నర్స్‌తో అసభ్యంగా ప్రవర్తించాడు. తన మాట వినకపోతె ట్రాన్స్‌ఫర్ చేయిస్తానని.. ఉద్యోగంలో నుంచి తీయిస్తానని బెదిరించాడు. దీంతో ఆవేదనకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రియాజ్‌ఖాన్‌కు ఎమ్మెల్యే చాంద్‌బాషా మద్దతు ఉందని అందుకే అతను ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.