Riyaz Khan
-
హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్
పాత నీరుపోవడం, కొత్త నీరు రావడం సహజం. అలా సినిమాల్లోనూ కొత్త ప్రవాహం వస్తూనే ఉంటారు. వారిలో నిలబడేది ఎందరన్నదే ప్రశ్న. అలా 'జిగిరి దోస్త్' అనే సినిమాతో ముగ్గురు నటులు, హీరోలుగా పరిచయమవుతున్నారు. వీరిలో షారీక్ హాసన్ ఒకరు. ఇతను బిగ్‌బాస్ రియాల్టీ షోలో గతంలో పాల్గొన్నాడు. ప్రముఖ నటుడు రియాజ్ ఖాన్, ఉమా రియాజ్ఖాన్ల వారసుడు. తమిళంలో 'పెన్సిల్' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి ఆకట్టుకున్న షారీక్.. ఇప్పుడు హీరోగా ఛాన్స్ కొట్టేశాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: శివాజీని తిట్టడానికే భయపడుతున్న నాగ్.. మరీ ఇలా అయితే ఎలా?) ఈ సినిమాలో షారీక్తో పాటు అరన్.వీ, వీజే.ఆషిక్ హీరోలుగా నటిస్తున్నారు. అమ్ము అభిరామి, పవిత్రాలక్ష్మి, అనుపమా కుమార్ హీరోయిన్లు. అరన్.వీ దర్శకుడు. ఈయన డైరెక్టర్ శంకర్‌కి శిష్యుడు. విక్కీ, రిషి, లోకి అనే ముగ్గురు బాల్యస్నేహితుల కథనే ఈ సినిమా అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మహాబలిపూరం ట్రిప్‌కి వెళ్తే, అక్కడ ఓ యువతిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయడం వీళ్లు చూస్తారు. మరి ఈ ముగ్గురు ఆ అమ్మాయిని కాపాడారా లేదా అనేది స్టోరీ. (ఇదీ చదవండి: Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?) -
కరోనా వైరస్ ; నటుడిపై దాడి
సినిమా: ప్రముఖ నటుడు రియాజ్‌ఖాన్‌పై కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన నటుడు రియాజ్ ఖాన్. ఈయన భార్య ఉమా రియాజ్ ఖాన్ కూడా నటినే. కాగా, రియాజ్‌ఖాన్ చెన్నై సమీపంలోని సముద్రతీరంలో ఉన్న పన్నయార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాగా రియాజ్‌ఖాన్ బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో వ్యాయామం చేసుకుంటున్నారు. అదేసమయంలో ఆ ప్రాంతంలో కొంతమంది గుంపుగా చేరి ముచ్చటించుకుంటున్నారు. దీంతో రియాజ్‌ఖాన్ వారిని సమీపించి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నిబంధనలు విధించింది మీరు వాటిని పాటిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోండని హితవు పలికారు. అయితే, వారిలో కొందరు రియాజ్‌ఖాన్‌ను తిరగబడి మాట్లాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గుంపులోని ఒకరు రియాజ్‌ఖాన్‌పై దాడి చేశారు. దీంతో కనత్తూరు పోలీసుస్టేషన్లో రియాజ్‌ఖాన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు. -
నర్సుపై టీడీపీ నేత లైంగిక వేధింపులు
అనంతపురం : రాష్ట్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు. తాజాగా అనంతలో టీడీపీ నేత లైంగిక వేధింపుల పర్వం వెలుగులోకి వచ్చింది. నల్లచెరువు పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న యువతిని ఆస్పత్రి కమిటీ చైర్మన్ గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. ఈ అంశంపై బాధితురాలు ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదు. పీహెచ్సీలో స్టాఫ్‌నర్స్‌గా పని చేస్తున్న యువతి(23)ని స్థానిక టీడీపీ నాయకుడు, ఆస్పత్రి కమిటీ చైర్మన్ రియాజ్‌ఖాన్(42) లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. రెండు రోజుల క్రితం మద్యం మత్తులో ఆస్పత్రికి వచ్చిన రియాజ్ ఖాన్ స్టాఫ్నర్స్తో అసభ్యంగా ప్రవర్తించాడు. తన మాట వినకపోతె ట్రాన్స్ఫర్ చేయిస్తానని.. ఉద్యోగంలో నుంచి తీయిస్తానని బెదిరించాడు. దీంతో ఆవేదనకు గురైన యువతి పోలీసులను ఆశ్రయించింది. కానీ పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీ కుదిర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. రియాజ్ఖాన్కు ఎమ్మెల్యే చాంద్‌బాషా మద్దతు ఉందని అందుకే అతను ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
ఒకే నటుడితో మట్రోరువన్
ఒకే ఒక నటుడు నటించిన చిత్రం మట్రోరువన్. నిజంగా ఇది సరికొత్త ప్రయోగమే. దీన్ని మరియా ఫిలింస్ కంపెనీ పతాకంపై వేల్మురుగన్, ఏఎం.సెబాస్టియన్, తిరుపూర్ మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవదర్శకుడు మజోమెథ్యూ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో కథానాయకుడిగా ఒకే ఒక్క పాత్రలో నటుడు రియాజ్‌ఖాన్ నటించారు.ఇంతకు ముందు నేశంపుదిదు చిత్రాన్ని తెరకెక్కించి,ప్రస్తుతం ఎవండీ ఉన్నై పెత్తాన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నిర్మాతల్లో ఒకరైన వేల్మురుగన్ మట్రోరువన్ చిత్రం గురించి మాట్లాడుతూ కథే తనను చిత్ర నిర్మాణ రంగంలోకి దించిందన్నారు. ఎంత అపాయానికైనా సిద్ధపడేలా చేసిందని చెప్పారు. దర్శకుడు తెలుపుతూ ఇది షేర్‌మార్కెట్ నేపథ్యంలో సాగే కథే అయినా అందరికీ అర్థమయ్యే విధంగా కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించిన హారర్ థ్రిల్లర్ చిత్రం అని పేర్కొన్నారు. చిత్రంలో ఒకే ఒక్క పాత్ర ఉంటుందని దాన్ని నటుడు రియాజ్‌ఖాన్ చాలెంజింగ్ తీసుకుని సమర్థవంతంగా పోషించారని తెలిపారు.అయితే చిత్రంలో రియాజ్ఖాన్తో పాటు ఒక నీడ కథ అంతా ఉంటుందన్నారు. అలాగే కనిపించని శత్రువు కూడా ఉంటాడని,అయితే అది నీడా, శత్రువునా,లేక భ్రమా అన్నది సస్పెన్స్ అన్నారు. ఇందులో కథానాయకుడు కలలు కంటాడని, అవి నిజ జీవితంలో జరుగుతుంటాయని చెప్పారు. అలా తను కన్న ఒక పెద్ద కల నిజ జీవితంలో జరి గిందా?లేదా? అన్నది చిత్ర క్లైమాక్స్ అని తెలి పారు. దీన్ని తమిళం, తె లుగు,మలయాళం భాష ల్లో తెరకెక్కించినట్లు వెల్లడించారు. చెన్నై, హైదరాబాద్,మూనార్ ప్రాంతా ల్లో 45 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసినట్లు తెలిపారు.చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. -
నిరాశనే మిగిల్చిన ఆస్ట్రిచ్ గుడ్లు
న్యూఢిల్లీ: ఆస్ట్రిచ్ పక్షుల గుడ్లు ఢిల్లీ జూ అధికారులకు నిరాశనమే మిగిల్చాయి. జూలోని ఓ ఆస్ట్రిచ్ పక్షి పెట్టిన 10 గుడ్లను జూ సిబ్బంది పొదిగేశారు. నిజానికి 45 నుంచి 55 రోజుల్లో ఆ గుడ్లలోనుంచి బుల్లి ఆస్ట్రిచ్‌లు బయటకు రావాలి. అయినప్పటికీ రాకపోవడంతో మరో పదిరోజులపాటు వేచి చూశారు. 62 రోజులు దాటినా ఆ గుడ్ల నుంచి ఎటువంటి పిల్లలు బయటకు రాకపోవడంతో గుడ్లు పొదగకుండానే పాడైపోయినట్లు గుర్తించిన అధికారులు నిరాశపడ్డారు. ఈ విషయమై జూ క్యూరేటర్ రియాజ్ ఖాన్ మాట్లాడుతూ.. పొదిగే కాలం దాటి పోవడంతో అధికారులు గుడ ్లను పరీక్షించారు. అందులో ఎటువంటి జీవం లేదని గుర్తించారు. గుడ్లు పూర్తిగా పాడైపోయానని నిర్ధారణకు వచ్చారు. సరైన వాతావరణ పరిస్థితులు లేకపోవడం, ఇటీవల వర్షం కురవడం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గుల కారణంగానే గుడ్లు పొదగకుండా పాడైపోయానని అధికారులు తెలిపారు. ఇటీవల వర్షాలు కురిసిన సమయంలోనే ఆస్ట్రిచ్ పక్షి గుడ్లు పెట్టింది. దీంతో వాటిని పొదుగేశాం. సరైన వేడి లేకపోవడంతోనే మొదటే అవి ఫలదీకరణం చెందకుండా పాడైపోయాయి. కొన్నిరోజులకు వాతావరణ పరిస్థితులు మారినా ఫలితం లేకుండా పోయింది. 20 సంవత్సరాల జూ చరిత్రంలో ఆస్ట్రిచ్ పక్షులు గుడ్లు పెట్టడడం ఇదే తొలిసారి. దీంతో వీటిని పొదుగేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. అయినా ఎటువంటి ఫలితం లేకపోయింద’న్నారు. పది గుడ్లలో కనీసం ఐదు గుడ్లయినా బుజ్జి ఆస్ట్రిచ్ పిల్లలను ఇస్తాయని భావించామని, అయితే నిరాశే మిగిలందన్నారు. కాగా ఈసారి పెట్టే గుడ్లను మరింత జాగ్రత్తగా పొదుగేస్తామన్నారు.