ఒకే నటుడితో మట్రోరువన్
ఒకే ఒక నటుడు నటించిన చిత్రం మట్రోరువన్. నిజంగా ఇది సరికొత్త ప్రయోగమే. దీన్ని మరియా ఫిలింస్ కంపెనీ పతాకంపై వేల్‌మురుగన్, ఏఎం.సెబాస్టియన్, తిరుపూర్ మోహన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నవదర్శకుడు మజోమెథ్యూ మెగాఫోన్ పట్టిన ఈ చిత్రంలో కథానాయకుడిగా ఒకే ఒక్క పాత్రలో నటుడు రియాజ్‌ఖాన్ నటించారు.ఇంతకు ముందు నేశంపుదిదు చిత్రాన్ని తెరకెక్కించి,ప్రస్తుతం ఎవండీ ఉన్నై పెత్తాన్ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న నిర్మాతల్లో ఒకరైన వేల్‌మురుగన్ మట్రోరువన్ చిత్రం గురించి మాట్లాడుతూ కథే తనను చిత్ర నిర్మాణ రంగంలోకి దించిందన్నారు.
ఎంత అపాయానికైనా సిద్ధపడేలా చేసిందని చెప్పారు. దర్శకుడు తెలుపుతూ ఇది షేర్‌మార్కెట్ నేపథ్యంలో సాగే కథే అయినా అందరికీ అర్థమయ్యే విధంగా కమర్షియల్ అంశాలు జోడించి రూపొందించిన హారర్ థ్రిల్లర్ చిత్రం అని పేర్కొన్నారు. చిత్రంలో ఒకే ఒక్క పాత్ర ఉంటుందని దాన్ని నటుడు రియాజ్‌ఖాన్ చాలెంజింగ్ తీసుకుని సమర్థవంతంగా పోషించారని తెలిపారు.అయితే చిత్రంలో రియాజ్‌ఖాన్‌తో పాటు ఒక నీడ కథ అంతా ఉంటుందన్నారు. అలాగే కనిపించని శత్రువు కూడా ఉంటాడని,అయితే అది నీడా, శత్రువునా,లేక భ్రమా అన్నది సస్పెన్స్ అన్నారు.
ఇందులో కథానాయకుడు కలలు కంటాడని, అవి నిజ జీవితంలో జరుగుతుంటాయని చెప్పారు. అలా తను కన్న ఒక పెద్ద కల నిజ జీవితంలో జరి గిందా?లేదా? అన్నది చిత్ర క్లైమాక్స్ అని తెలి పారు. దీన్ని తమిళం, తె లుగు,మలయాళం భాష ల్లో తెరకెక్కించినట్లు వెల్లడించారు. చెన్నై, హైదరాబాద్,మూనార్ ప్రాంతా ల్లో 45 రోజుల్లో చిత్రీకరణను పూర్తి చేసినట్లు తెలిపారు.చిత్రాన్ని మేలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.