
సినిమా: ప్రముఖ నటుడు రియాజ్‌ఖాన్‌పై కొందరు వ్యక్తులు బుధవారం దాడి చేశారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమిళం, మలయాళం, తెలుగు భాషల్లో వివిధ రకాల పాత్రలు పోషించిన నటుడు రియాజ్ ఖాన్. ఈయన భార్య ఉమా రియాజ్ ఖాన్ కూడా నటినే. కాగా, రియాజ్‌ఖాన్ చెన్నై సమీపంలోని సముద్రతీరంలో ఉన్న పన్నయార్ ప్రాంతంలో నివసిస్తున్నారు. కాగా రియాజ్‌ఖాన్ బుధవారం ఉదయం ఆ ప్రాంతంలో వ్యాయామం చేసుకుంటున్నారు. అదేసమయంలో ఆ ప్రాంతంలో కొంతమంది గుంపుగా చేరి ముచ్చటించుకుంటున్నారు.
దీంతో రియాజ్‌ఖాన్ వారిని సమీపించి కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం నిబంధనలు విధించింది మీరు వాటిని పాటిస్తూ ఇక్కడి నుంచి వెళ్లిపోండని హితవు పలికారు. అయితే, వారిలో కొందరు రియాజ్‌ఖాన్‌ను తిరగబడి మాట్లాడారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గుంపులోని ఒకరు రియాజ్‌ఖాన్‌పై దాడి చేశారు. దీంతో కనత్తూరు పోలీసుస్టేషన్లో రియాజ్ఖాన్ ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment