పాత నీరుపోవడం, కొత్త నీరు రావడం సహజం. అలా సినిమాల్లోనూ కొత్త ప్రవాహం వస్తూనే ఉంటారు. వారిలో నిలబడేది ఎందరన్నదే ప్రశ్న. అలా 'జిగిరి దోస్త్' అనే సినిమాతో ముగ్గురు నటులు, హీరోలుగా పరిచయమవుతున్నారు. వీరిలో షారీక్ హాసన్ ఒకరు. ఇతను బిగ్‌బాస్ రియాల్టీ షోలో గతంలో పాల్గొన్నాడు. ప్రముఖ నటుడు రియాజ్ ఖాన్, ఉమా రియాజ్‌ఖాన్‌ల వారసుడు. తమిళంలో 'పెన్సిల్' చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి ఆకట్టుకున్న షారీక్.. ఇప్పుడు హీరోగా ఛాన్స్ కొట్టేశాడు.
(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: శివాజీని తిట్టడానికే భయపడుతున్న నాగ్.. మరీ ఇలా అయితే ఎలా?)
ఈ సినిమాలో షారీక్‌తో పాటు అరన్.వీ, వీజే.ఆషిక్ హీరోలుగా నటిస్తున్నారు. అమ్ము అభిరామి, పవిత్రాలక్ష్మి, అనుపమా కుమార్ హీరోయిన్లు. అరన్.వీ దర్శకుడు. ఈయన డైరెక్టర్ శంకర్‌కి శిష్యుడు. విక్కీ, రిషి, లోకి అనే ముగ్గురు బాల్యస్నేహితుల కథనే ఈ సినిమా అని దర్శకుడు చెప్పుకొచ్చాడు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ మహాబలిపూరం ట్రిప్‌కి వెళ్తే, అక్కడ ఓ యువతిని ఒక గ్యాంగ్ కిడ్నాప్ చేయడం వీళ్లు చూస్తారు. మరి ఈ ముగ్గురు ఆ అమ్మాయిని కాపాడారా లేదా అనేది స్టోరీ.
(ఇదీ చదవండి: Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?)
Comments
Please login to add a commentAdd a comment