కోట్లాది మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన టి.బిల్లుపై ఎందుకు స్పందించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ... రాష్ట్ర విభజన అత్యంత ప్రధానమైన అంశమని, అయితే ఆ అంశంపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదంటూ ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
టి.బిల్లుపై సభలో ఓటింగ్ ద్వారా సభ్యుల అభిప్రాయాలు వెల్లడవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వైఖరిని ధూళిపాళ్ల నరేంద్ర తప్పు పట్టారు. బీఏసీ సమావేశంలో సీఎం ఒకటి చెబుతారు, బయటకు వచ్చి మరోకటి మాట్లాడతారని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు.