
సాక్షి, గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్ర చేయని నేరాలు, ఘోరాలు లేవని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం సంగం డెయిరీ ఆక్రమించుకున్నాడని దుయ్యబట్టారు.
‘‘జీడీసీసీ బ్యాంకులో రూ.500 కోట్ల అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. దమ్ముంటే అక్రమాలను నిరూపించాలని.. నిరూపిస్తే పాలకమండలి మొత్తం రాజీనామా చేస్తామని సీతారామాంజనేయులు సవాల్ విసిరారు. నిరూపించకుంటే సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్నారు.
చదవండి: పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు
2017 నుంచి పథకం ప్రకారం టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకున్నారన్నారు. వారిలో 15 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. బ్యాంకు రుణాలకు సంబంధించిన డేటా ఇవ్వమని ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నాడు. ఆధారాలు లేకుండా ఎలా రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?. గతంలో చింతలపూడి సహకార సంఘం సెక్రటరీని ధూళిపాళ్ల వేధించారు. ఆయన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారని గుర్తు చేశారు. కోవిడ్ టైమ్‌లో డీవీసీ ఆసుపత్రి ద్వారా ధూళిపాళ్ల రూ.కోట్లు సంపాదించారని రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment