GDCC
-
‘కన్నా నీ చరిత్ర నాకు తెలుసు.. దమ్ముంటే చర్చకు రావాలి’
సాక్షి, గుంటూరు: జీడీసీసీ బ్యాంకు, ప్రభుత్వంపై కన్నా లక్ష్మీనారాయణ విమర్శలు చేయడం దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని జీడీసీసీ బ్యాంకు ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు అన్నారు. బ్యాంకులో రూ.500కోట్ల కుంభకోణం జరిగిందని కన్నా చెబుతున్నారు. ఆయనకు దమ్ముంటే కుంభకోణం జరిగిందని నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా, బ్యాంక్ చైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కుంభకోణం జరిగిందని కన్నా నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. లేకపోతే కన్నా రాజకీయాల నుంచి తప్పుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ నిజాయితీపరుడో లేక నేను నిజాయితీపరుడినో చర్చికుందాం చర్చకు రావాలి. కన్నా నీ చరిత్ర అంతా నాకు తెలుసు. 90 గజాల రేకుల షెడ్డు నుంచి రూ.వేల కోట్లు ఎలా సంపాదించావో చెప్పు. రైతులను మోసం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దొంగతనం చేసింది ధూళిపాళ్ల నరేంద్ర. కన్నాకు దమ్మంటే రైతులకు సంబంధించిన సంగం డెయిరీని దూళిపాళ్ల నరేంద్ర నుంచి రైతులకు ఇప్పించాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: పవన్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు..: కాపు మహిళా నేతలు -
‘ధూళిపాళ్ల నరేంద్ర చేయని నేరాలు, ఘోరాలు లేవు’
సాక్షి, గుంటూరు: ధూళిపాళ్ల నరేంద్ర చేయని నేరాలు, ఘోరాలు లేవని జీడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒక పథకం ప్రకారం సంగం డెయిరీ ఆక్రమించుకున్నాడని దుయ్యబట్టారు. ‘‘జీడీసీసీ బ్యాంకులో రూ.500 కోట్ల అక్రమాలు జరిగాయని ధూళిపాళ్ల నరేంద్ర తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు. దమ్ముంటే అక్రమాలను నిరూపించాలని.. నిరూపిస్తే పాలకమండలి మొత్తం రాజీనామా చేస్తామని సీతారామాంజనేయులు సవాల్ విసిరారు. నిరూపించకుంటే సంగం డెయిరీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయాలన్నారు. చదవండి: పెగాసస్‌పై టీడీపీ ఎందుకు కంగారుపడుతోంది: అంబటి రాంబాబు 2017 నుంచి పథకం ప్రకారం టీడీపీ నేతలు నకిలీ డాక్యుమెంట్లు పెట్టి లోన్లు తీసుకున్నారన్నారు. వారిలో 15 మంది టీడీపీ కార్యకర్తలు ఉన్నారు. బ్యాంకు రుణాలకు సంబంధించిన డేటా ఇవ్వమని ధూళిపాళ్ల నరేంద్ర చెబుతున్నాడు. ఆధారాలు లేకుండా ఎలా రూ.500 కోట్ల కుంభకోణం జరిగిందని తప్పుడు ప్రచారం ఎలా చేస్తారు?. గతంలో చింతలపూడి సహకార సంఘం సెక్రటరీని ధూళిపాళ్ల వేధించారు. ఆయన వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపించారని గుర్తు చేశారు. కోవిడ్ టైమ్‌లో డీవీసీ ఆసుపత్రి ద్వారా ధూళిపాళ్ల రూ.కోట్లు సంపాదించారని రాతంశెట్టి సీతారామాంజనేయులు మండిపడ్డారు. -
రైతులకు సకాలంలో రుణాలివ్వాలి
జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో సహకార బ్యాంకులకు వచ్చే ప్రతి రైతుకు సకాలంలో రుణం ఇవ్వాలని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య సూచించారు. స్థానిక బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ పరిపాలనా కార్యాలయంలో శుక్రవారం బ్యాంక్ పాలకవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ రుణాల టార్గెట్ రూ.770 కోట్లుకాగా, ఇప్పటివరకు రూ.650 కోట్లు పంపిణీ చేయటం చేశామని చెప్పారు. విద్యారుణాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచామన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు తమ గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులకు రూ.10లక్షల వరకు ప్లెడ్జ్లోన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పాలకవర్గం పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30కోట్లు పోరుబాకీలను వసూలు చేసినట్లు తెలిపారు. సహకార బ్యాంకుల్లో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నరసరావుపేట సమీపంలోని ఓ కోల్డ్‌స్టోరేజ్‌లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని, అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, బ్యాంక్ సీఈవో భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులు జయరామయ్య, రత్తయ్య పాల్గొన్నారు.