రైతులకు సకాలంలో రుణాలివ్వాలి
రైతులకు సకాలంలో రుణాలివ్వాలి
Published Sat, Jul 30 2016 6:22 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని
కొరిటెపాడు (గుంటూరు): జిల్లాలో సహకార బ్యాంకులకు వచ్చే ప్రతి రైతుకు సకాలంలో రుణం ఇవ్వాలని జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య సూచించారు. స్థానిక బ్రాడీపేటలోని జీడీసీసీ బ్యాంక్ పరిపాలనా కార్యాలయంలో శుక్రవారం బ్యాంక్ పాలకవర్గ సమావేశం జరిగింది. అనంతరం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య మాట్లాడారు. జిల్లాలో ఖరీఫ్ రుణాల టార్గెట్ రూ.770 కోట్లుకాగా, ఇప్పటివరకు రూ.650 కోట్లు పంపిణీ చేయటం చేశామని చెప్పారు. విద్యారుణాన్ని రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచామన్నారు. రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేనప్పుడు తమ గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులకు రూ.10లక్షల వరకు ప్లెడ్జ్‌లోన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పాలకవర్గం పదవీబాధ్యతలు చేపట్టిన తర్వాత రూ.30కోట్లు పోరుబాకీలను వసూలు చేసినట్లు తెలిపారు. సహకార బ్యాంకుల్లో అలసత్వం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. నరసరావుపేట సమీపంలోని ఓ కోల్డ్‌స్టోరేజ్‌లో జరిగిన అక్రమాలపై విచారణ జరుగుతుందని, అక్రమాలకు పాల్పడ్డవారిపై చర్యలు తప్పవన్నారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ కుర్రి సుబ్బారెడ్డి, బ్యాంక్ సీఈవో భానుప్రసాద్, పాలకవర్గ సభ్యులు జయరామయ్య, రత్తయ్య పాల్గొన్నారు.
Advertisement