
రుణమాఫీ కోసం రైతుల ఆందోళన
కుందుర్పి : మండలంలోని తూముకుంట పంచాయతీలో 88 మంది రైతులకు 2015కు సంబంధించిన రుణమాఫీ అందలేదని సోమవారం రెవెన్యూ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా భాగంగా రైతులు మాట్లాడుతూ పలుసార్లు విజయవాడ వ్యవసాయశాఖకు లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకొన్నా స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు... రైతులను మోసగించే పథకాలు ఎందుకు ప్రవేశపెడుతున్నారో అర్థకావడం లేదన్నారు. 2016కు సంబంధించి తూముకుంటలో 140 మంది రైతులకు పరిహారం అందలేదని చెప్పారు. రుణమాఫీకి సంబంధించిన దరఖాస్తులను స్థానిక ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరికి అందజేసినా ఒకరిద్దరికి మినహా రుణమాఫీ ఎవరికీ అందలేదన్నారు. ఈ విషయమై ఏఓ మధుకుమార్ మాట్లాడుతూ రుణమాఫీ గురించి అడగొద్దనీ, వ్యవసాయ అధికారిగా తాము ఏమీ చేయలేమని, పంటనష్ట పరిహారం మాత్రం అర్హులైన రైతులకు అందజేస్తామన్నారు. దీంతో రైతులు వెనుదిరిగారు.