డీసీసీబీ ద్వారా రూ.15కోట్ల పంట రుణాలు
Published Mon, Feb 27 2017 10:54 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
కర్నూలు(అగ్రికల్చర్): కొత్త రైతులకు పంట రుణాలు ఇచ్చేందుకు జిల్లా సహకార కేంద్రబ్యాంకు(డీసీసీబీ) ముందుకు వచ్చింది. దాదాపు రూ.15 కోట్ల మేర కొత్త పంట రుణాలు ఇచ్చేందుకు జిల్లాలోని 85 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు బడ్జెట్ కేటాయించింది. ఆప్కాబ్ కొంత , డీసీసీబీ మరికొంత బడ్జెట్ ఇస్తుంది. డీసీసీబీ.. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటి వరకు పాత రుణాలను రెన్యువల్ చేయడం మినహా కొత్త రుణాలు ఇవ్వలేదు. ఆర్థిక సంవత్సరం ముగిసే సమయంలో పంటరుణాలకు బడ్జెట్ ఇవ్వడం విశేషం.
Advertisement
Advertisement