
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్ని డ్రామాలు ఆడినా జనం నమ్మరని, రానున్నవి టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలని ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. తాజాగా కర్నూల్ పర్యటనలో చంద్రబాబు చేసిన ‘చివరి ఎన్నిక కామెంట్ల’పై.. గురువారం తాడేపల్లిలో మంత్రి సీదిరి మీడియాతో మాట్లాడారు.
‘‘చంద్రబాబు తొలిసారి నిజం మాట్లాడారు. 2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు కానున్నాయి. అవి టీడీపీకి సమాధి కట్టే ఎన్నికలని మంత్రి అప్పలరాజు ఎద్దేవా చేశారు. తులసి తీర్థం పోస్తే తప్ప బతకను అన్నట్లుగా చంద్రబాబు కన్నీరు కారుస్తున్నారు. పనిలో పనిగా ఆయన తన భార్యను కూడా రాజకీయాల్లోకి లాగారు. భార్యను అడ్డుపెట్టుకుని సానుభూతి పొందాలనుకోవడం దారుణం. కానీ, ఆయన ఎన్ని నాటకాలు ఆడినా జనం నమ్మరు.
‘‘వెన్నుపోటు, నమ్మకద్రోహమే చంద్రబాబు పెట్టుబడి. ఆయన పాలనలో ఆయన వర్గానికే మేలు జరిగింది. గుర్తుంచుకునే పథకం ఒక్కటైనా అమలు చేశారా?. రాజకీయాల కోసం చంద్రబాబు ఎంతకైనా దిగరాజరతాడు. చంద్రబాబు ఏడుపులు, గగ్గోలు చూసి జనం నవ్వుకుంటున్నారు. తనయుడు లోకేష్‌పై చంద్రబాబుకు ఆశలు లేవు. తీవ్ర మానసిక ఒత్తిడిలో చంద్రబాబు ఏదేదో మాట్లాడుతున్నారు. వికేంద్రీకరణను పక్కదారి పట్టించేందుకే కర్నూల్‌లో బాబు పర్యటిస్తున్నాడు. కర్నూల్‌లో హైకోర్టుకు చంద్రబాబు వ్యతిరేకమా? కాదా?.. వ్యతిరేకమే’’ అని ఉద్ఘాటించారు మంత్రి సీదిరి అప్పలరాజు.
Comments
Please login to add a commentAdd a comment