
శ్రీకాకుళం జిల్లా: తెలంగాణ మంత్రులు ఏపీ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు మంత్రి సీదిరి అప్పలరాజు. తెలంగాణ మంత్రి హరీష్‌రావును పవన్ వెనుకేసుకొచ్చి మాట్లాడుతున్నారంటే ఎలా అర్ధం చేసుకోవాలని నిలదీశారు మంత్రి అప్పలరాజు.
‘తెలంగాణ మంత్రులు ఏపీ రాష్ట్రాన్ని అవమానపరుస్తుంటే పవన్ కల్యాణ్ ఎందుకు నోరు మెదపడం లేదు. బీఆర్‌ఎస్‌తో పవన్ కల్యాణ్‌కు ఉన్న రహస్య ఒప్పందం ఏమిటి?, పవన్ కల్యాణ్‌తో బీఆర్‌ఎస్ వేల కోట్ల ఒప్పందం జరిగిందని మీడియాలో చూశా. బహుశా ఇది నిజమేనేమో. తెలంగాణలో బీఆర్‌ఎస్‌తో, ఏపీలో చంద్రబాబుతో పవన్ కల్యాణ్‌కు ఉన్న లాలూచీ ఏమిటి. వరంగల్‌లో అమ్మాయి ఆత్మహత్య, తలంగాణ ఆస్పత్రిలో వీల్‌చైర్‌లో రోగిని ఈడ్చుకువెళ్తే మాట్లాడావా. గోదావరి జలాలపై మాట్లాడావా. మరి ఇప్పుడు హరీష్‌రావుని వెనకేసుకొచ్చి మాట్లాడుతున్నావంటే.. మేం ఏం అర్థం చేసుకోవాలి. సీఎం జగన్ కోసం తక్కువ మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని హెచ్చరించారు మంత్రి అప్పలరాజు.