
సాక్షి, శ్రీకాకుళం: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ఫైరయ్యారు. ముందు నువ్వు ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచి పోటీ చేస్తావో చెప్పు అని ప్రశ్నించారు. అసలు జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో చెప్పాలి. ముఖ్యమంత్రి పదవి అంటే ప్రజలు ఇవ్వాలి.. అడుకుంటే రాదు పవన్ అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ అసెంబ్లీకి వెళ్లడానికి నన్ను ఎవరు ఆపేది అంటున్నాడు. ముందు ఎక్కడ పోటీ చేస్తున్నాడు చెప్పమనండి. రాష్ట్రం మొత్తం నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే ఎలా?. ముందు ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తావో డిసైడ్ అవ్వు. రాష్ట్రం మొత్తం తిరిగి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అంటే అది అసమర్థ యాత్ర. 30 నియోజకవర్గాల్లో పోటీ చేస్తే సీఎం అవ్వరు అంటూ చురకలు అంటించారు.
చెప్పులు పోతే కొనుకోవచ్చు కానీ.. మీ పార్టీ గుర్తుపోతే ఎలా?. మీ గుర్తే మీకు తెలియదు. ముందు మీ గుర్తు ఏదో వెత్తుకోండి. 2019లో అందరూ కలిసే ఉన్నారు. మేము ఒంటరిగా పోటీ చేస్తాం. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాం అని స్పష్టం చేశారు. పవన్.. నేను ట్రైనింగ్ అయ్యాను.. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అంటున్నావ్. అసలు జనసేన ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందో చెప్పాలి అని కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: పవన్.. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావ్: మంత్రి వేణు