
పదవులంటే అత్యాశ కలిగిన వారు మాత్రమే పార్టీని వీడుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గెలవడం ముఖ్యం కాదని.. జగన్ సీఎం కావడం అవసరమన్నారు.
సాక్షి, విశాఖపట్నం: పదవులంటే అత్యాశ కలిగిన వారు మాత్రమే పార్టీని వీడుతున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తాను గెలవడం ముఖ్యం కాదని.. జగన్ సీఎం కావడం అవసరమన్నారు. అన్ని రంగాలు బాగుపడాలంటే వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావాలన్నారు. తాము గెలుస్తాం అనుకుంటేనే టికెట్ ఇవ్వమని తామే చెప్పామని మంత్రి అప్పలరాజు అన్నారు.
‘‘చంద్రబాబు ఆధునిక అంటరానితనాన్ని ప్రోత్సాహించాడు. పేద వర్గాలను వేరు చేశాడు. ఆధునిక అంటరానితనం పోయి.. సమసమాజం నిర్మాణం కావాలంటే జగన్ సీఎం కావడం అవసరం. భువనేశ్వరి యాత్ర చేస్తే ఒరిగేది ఏంటి..? రాజకీయాల్లో ఆమెకున్న ప్రాదాన్యత ఏమిటి..? బాబు జైలులో ఉన్నప్పుడు డ్రామాలు చేశారు. బయటకు వచ్చాక ఆపేసారు. ఇప్పుడు మమ అనిపిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ఇదీ చదవండి: టీడీపీ ప్లాన్.. కాంగ్రెస్ యాక్షన్