సాక్షి, విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు ఒక శాడిస్ట్ అంటూ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. 2014-19 వరకూ వైఎస్సార్ విగ్రహాలు పెట్టనివ్వకుండా చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారని, వైఎస్సార్ ఫోటోను చూసినా చంద్రబాబు భయపడుతుంటారని ఎద్దేవా చేశారు వెల్లంపల్లి. ‘విజయవాడలో రాత్రికి రాత్రి 45 ఆలయాలను కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబు. సీఎం జగన్ వచ్చాక ఆ ఆలయాన్నింటిని పునర్‌నిర్మిస్తున్నారు.చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకు వస్తుందా?, వైఎస్సార్ కుటుంబం అంటే గుర్తొచ్చేది అభివృద్ధి సంక్షేమం. చంద్రబాబు అంటే అవినీతి వెన్నుపోటు’ అని వెల్లంపల్లి ధ్వజమెత్తారు.
ఒలింపిక్స్‌లో మెడల్‌కొట్టి డోపింగ్‌లో దొరికినట్టయ్యింది
చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులివ్వడంపై మంత్రి సీదిరి అప్పలరాజు తనదైన శైలిలో చమత్కరించారు. చంద్రబాబు పరిస్థితి ఒలింపిక్స్‌లో మెడల్‌కొట్టి, డోపింగ్‌లో దొరికినట్లయ్యిందన్నారు. ‘ చంద్రబాబుకు ఐటీశాఖ నోటీసులిచ్చింది. లెక్కల్లో చూపని రూ. 118 కోట్లకు చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులిచ్చింది. బాబుకు ఐటీ నోటీసులపై రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌నాయుడు స్పందించరు. బాబు తప్పుల గురించి వారు ప్రజలకు తెలపరు. అమరావతి అనే మాయా ప్రపంచాన్ని చంద్రబాబు సృష్టించారు. అమరావతిలో ఇతురులెవరూ భూమి కొనుగోలు చేయకుండా చట్టం సృష్టించాడు బాబు. చంద్రబాబు పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే చెప్పారు’ అని మంత్రి అప్పలరాజు మరోసారి గుర్తుచేశారు.
చదవండి: లోకేశ్.. ఇప్పుడెందుకు మాట్లాడటం లేదు: కన్నబాబు పొలిటికల్ పంచ్
Comments
Please login to add a commentAdd a comment