సాక్షి, శ్రీకాకుళం: టీడీపీ నేత అచ్చెన్నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అచ్చెన్నాయుడు చర్చకు రావాలన్నారు. నా ఛాలెంజ్‌ను అచ్చెన్నాయుడు స్వీకరించాలని కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి సీదిరి అప్పలరాజు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో చిరునామా ఉందా?. చంద్రబాబు, నారా లోకేష్ ఆధార్ కార్డులు ఎక్కడ ఉన్నాయి. మా రాష్ట్రం గురించి పక్క రాష్ట్రం వాళ్లు మాట్లాడాల్సిన అవసరం లేదు. రామ్మోహన్‌నాయుడు కూడా మైక్‌ల ముందు మాట్లాడేస్తున్నాడు. నీ బాబాయ్ నిన్ను క్షేత్రస్థాయిలోకే వెళ్లనివ్వడం లేదు. ఎంపీ లాడ్స్ నుంచి పలాస రైల్వే స్టేషన్‌లో స్టీల్ కుర్చీలు మాత్రమే వేసిన రామ్మోహన్ నాయుడా అభివృద్ధి గురించి మాట్లాడేది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై అచ్చెన్నాయుడు చర్చకు రావాలి. నా ఛాలెంజ్‌ను అచ్చెన్నాయుడు స్వీకరించాలి.
ఇదే క్రమంలో గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌కి బయ్యారం గనులు అడిగితే వ్యతిరేకించారు. స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొంటామని బీఆర్‌ఎస్ హైప్ క్రియేట్ చేసింది అంటూ కేసీఆర్ సర్కార్‌పై ఘాటు విమర్శలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment