
సాక్షి, తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి దళితులంటే ఎంతో గౌరవం ఉందని, డా.బాబా సాహేబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని నిబద్దతతో అమలు చేస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. దళిత మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దేనని కొనియాడారు. వైఎస్సార్ సీపీ అందరికీ సమాన హక్కులు, హోదా ఉండాలని కోరుకునే ప్రజా పార్టీ అని పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ దళితుల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా? అని మాట్లాడిన చంద్రబాబు ఇవాళ దళితుల కోసం మాట్లాడుతున్నాడు. ( ఆ సమావేశానికి కర్త కర్మ క్రియ చంద్రబాబే..)
దెయ్యాలు వేదాలు వల్లిస్తాయని అనడానికి చంద్రబాబును ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎంపీ రఘురామ కృష్ణంరాజు చేస్తున్న విమర్శలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఒక వ్యక్తి చేసిన విమర్శలు సద్విమర్శలు అయితే ప్రతి ఒక్కరు దానిని ఆహ్వానిస్తారు. నాయకుని పట్ల అంకిత భావంతో ఉండాలి. ఇవాళ మేమంతా సీఎం జగన్ కోసం అంకిత భావంతో పని చేస్తున్నా’’మన్నారు.
Comments
Please login to add a commentAdd a comment