
సాక్షి, తూర్పు గోదావరి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేసిన మూడు రాజధానుల ప్రతిపాదనకు మేము పూర్తిగా మద్దతు పలుకుతున్నామని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏపీని దేశంలోనే ఒక అగ్రగామిగా తయారు చేస్తారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. వైఎస్ జగన్ చేసిన ప్రతిపాదనలో మూడు ప్రాంతాలు అభివృద్ధి కావాలనే స్వచ్ఛమైన ఆలోచననే కలిగి ఉన్నారని అన్నారు. రాజధాని పేరుతో చంద్రబాబు అమరావతిలో రియల్ ఎస్టేట్ కంపెనీ పెట్టారు. ఆయనకు రియల్ ఎస్టేట్ మీద ఉన్న ప్రేమ రియల్‌స్టేట్ మీద లేదని విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లాను కమర్షియల్ హబ్‌గా గుర్తించాలని త్వరలోనే సీఎంను కోరనున్నట్లు కురసాల కన్నబాబు పేర్కొన్నారు.