
సాక్షి, అమరావతి: టీడీపీ నేత అచ్చెన్నాయుడు శ్రీకాకుళం పరువు తీస్తున్నారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అచ్చెన్నాయుడు తీరుపై మండిపడ్డారు. పోలీస్ అధికారులను యూజ్‌లెస్ ఫెలో అనడం శోచనీయమన్నారు. ప్రశాంత రాష్ట్ర్రంలో అశాంతి వాతావరణం సృష్టించడానికి ఎత్తుగడలు వేసి.. టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు. టీడీపీ చేపట్టిన చలో ఆత్మకూరు షో అట్టర్ ప్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర్రంలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.