సాక్షి, విజయవాడ: ‘సినిమాల్లోనే పవన్ కల్యాణ్ వకిల్ సాబ్ అని.. బయట మాత్రం పకీర్ సాబ్’ అంటూ దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. పవన్ పర్యటన సినిమా ప్రమోషన్‌లా ఉందంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తూర్పు నియోజకవర్గంలోని ఏ వన్ కన్వెన్షన్‌లో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టినప్పటి నుంచి ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకుని పేదలకు అండగా నిలిచారన్నారు. చంద్రబాబు అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేసి ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకున్నపటికి వాటిని సీఎం జగన్ ఛేదించి ప్రజలకు పట్టాలను అందించారని తెలిపారు.(చదవండి: బాబుపై సీఎం జగన్ వ్యంగ్యాస్త్రాలు)
‘‘జయంతి, వర్ధంతికి తేడా తెలియని నారా లోకేష్.. సీఎం జగన్‌ను విమర్శించడం హాస్యాస్పదం. దివంగత మహానేత వైఎస్సార్ హయాంలో పేదలు ఎంత ఆనందంగా ఉన్నారో.. ఆయన తనయుడు జగన్ పాలనలో ప్రజలు రెట్టింపు సంతోషంగా ఉన్నారని’’ మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు.
ఆ ఘనత వైఎస్ జగన్‌దే: దేవినేని అవినాష్
వైఎస్సార్‌సీపీ తూర్పు ఇంఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే వైఎస్ జగన్ హామీలన్నీ అమలు చేశారని తెలిపారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన నవరత్నాలు అన్ని అమలు చేసి చూపించిన ఘనత జగన్‌కే సొంతమన్నారు. ఉగాది నాడు ఇళ్ల పట్టాల పట్టాభిషేకం జరగాల్సి ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు సిగ్గులేకుండా ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తూర్పు నియోజకవర్గంలో 28 వేల మందికి ఇళ్ళ పట్టాలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నానని దేవినేని అవినాష్ అన్నారు. (చదవండి: ‘మంత్రులకు పవన్ క్షమాపణ చెప్పాలి’)
Comments
Please login to add a commentAdd a comment