సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు’ పథకం రెండో దశ కింద పీఎంఏవై–వైఎస్సార్ గ్రామీణ్‌లో భాగంగా 1,79,060 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాసిన లేఖతో కూడిన పట్టాల పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చేపట్టారు.
చదవండి: పరిశ్రమలకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్..
ఈ నెల 17వ తేదీ నాటికి పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలు, సీఎం రాసిన లేఖలను పంపిణీ చేశారు. ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, కొయ్యలగూడెంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పాడేరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment