రాజధాని మారితే తన భూముల రేట్లు తగ్గిపోతాయనే భయంతో చంద్రబాబు నాయుడు ఆందోళనలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి రాజధాని తరలిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడా చెప్పలేదన్నారు. తన భూముల ధరలు పడిపోతాయనే చంద్రబాబు గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. మహిళలను ముందు పెట్టుకొని ఒక శిఖండిలా చంద్రబాబు ఉద్యమాలు చేయిస్తున్నారని మండిపడ్డారు.