సుజనా చౌదరి అలియాస్ యలమంచిలి సత్యనారాయణ చౌదరి.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సయామీ కవల. జాతీయ బ్యాంకులకు రూ.ఆరు వేల కోట్లకు పైగా ఎగ్గొట్టిన ఘనుడు! రాజధాని ప్రాంతంలో తనకుగానీ తన కుటుంబ సభ్యులకుగానీ ఒక్క సెంటు భూమి కూడా లేదని బుకాయిస్తున్నారు. సెంటు కాదు.. ఏకంగా 623.12 ఎకరాల భూములు సొంతం చేసుకున్నది మాత్రం నిజం!