
సాక్షి, విజయవాడ : మూడేళ్లలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశముందంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. జమిలి ఎన్నికలపై మాట్లాడే స్థాయిలో చంద్రబాబు లేరని, ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమేనని సుజనా పేర్కొన్నారు. జమిలి ఎన్నికలపై తనకు సమాచారం లేదని తెలిపారు. పోలవరంపై కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందని, ఆ తర్వాత టీడీపీ హయాంలోనూ కాలయాపన జరగడం వల్ల ట్రాక్ తప్పిందని సుజనా పేర్కొన్నారు.