
.సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే స్థాయి నారా లోకేష్‌కు లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన శుక్రవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ..‘లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అతడిని మించిన సైకో ఎవరూ లేరు. మంత్రి పదవి కోసం చంద్రబాబును సోఫాలో పడుకోబెట్టి ఒత్తిడి తెచ్చిన సైకో. వైఎస్సార్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. లోకేష్ తిన్నది అరక్క నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. లోకేష్ తాత గురించి తిరుపతిలో ఎవరిని అడిగినా చెబుతారు. ఇక చంద్రబాబు రాష్ట్రాన్ని దోచేసిన దొంగ. ఎంపీ సుజనా చౌదరి బ్రోకర్‌లా మాట్లాడుతున్నారు. బ్యాంకులకు కన్నాలేసిన దొంగ ఆయన. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు బీజేపీలోకి వెళ్లాల్సిన ఖర్మ పట్టలేదు.’ అని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Comments
Please login to add a commentAdd a comment