
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌కుమార్ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో బీజేపీ నాయకులు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌లతో భేటీ కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'నిమ్మగడ్డ రమేష్, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి... వీరు ముగ్గురూ స్టార్ హోటల్ కేంద్రంగా చేయగల వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?' అంటూ పేర్కొన్నారు. చదవండి: బయటపడ్డ నిమ్మగడ్డ.. ఉలిక్కిపడ్డ టీడీపీ
కాగా మరో ట్వీట్‌లో.. 'బాబు హైదరాబాద్‌లో చేస్తున్న గలీజు పనులివే. గోతులు తవ్వడం, చీకటి వ్యాపారాలు, మ్యానిప్యులేషన్లు, వ్యవస్థలను మ్యానేజ్ చేయడంలో మునిగి తేలుతుంటాడు. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని విజయవంతంగా సమాధి చేసి, దళారి స్థాయికి పతనమయ్యాడు. అధికారం దరిదాపుల్లోకి ఎప్పటికీ రాలేడు' అంటూ చంద్రబాబుపై విజయసాయి రెడ్డి మండిపడ్డారు. చదవండి: హైదరాబాద్ స్టార్ హోటల్‌లో గూడుపుఠాణి!