ఇదేం పారదర్శకత చిట్టినాయుడు: విజయసాయి రెడ్డి | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu  | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 27 2018 9:07 PM | Last Updated on Tue, Nov 27 2018 9:31 PM

Vijaya SaiReddy Slams Chandrababu Naidu  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై, మంత్రి లోకేశ్‌పై  ధ్వజమెత్తారు. ఇదేం పారదర్శకతా చిట్టి నాయుడూ.. అంటూ మంత్రి లోకేశ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వేల కోట్ల ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి లూటీ చేసిన సుజనా చౌదరికి.. చంద్రబాబు రెండు సార్లు రాజ్యసభ అవకాశం ఇచ్చారని, ప్రధాని అభ్యంతరం చెప్పినా ఒత్తిడి తెచ్చి కేంద్రమంత్రిని చేశారంటే.. చంద్రబాబుకు ఆయనెంత ముఖ్యమో అర్థమవతుందన్నారు. చిన్న రాష్ట్రానికి సీఎం అయిన చంద్రబాబు జాతీయ పార్టీ కాంగ్రెస్‌కు వెయ్యికోట్లకు ఫండింగ్‌ చేయగలిగారంటున్నారంటే.. చంద్రబాబు ఎంటో తెలుస్తుందన్నారు. నాయుడు బాబు తెగ జోకులు పేలుస్తున్నారని, ఐఏఎస్‌ అధికారి ఆపై విమానాల పైలెట్‌ అవ్వాలనుకున్నారని, డాక్టర్‌ కావాలనుకుని పొలిటికల్‌ యాక్టరయ్యానని చెప్పడం విని నవ్వకుంటున్నారని ఎద్దేవ చేశారు. తుమ్మినా.. దగ్గినా రాసే కుల పత్రికలుండటంతో బాబు వెరైటీ కామెడీ చేస్తున్నారని ఎద్దేవ చేశారు. ఏదైనా అయ్యేవాడో కాదో గాని, ఆంధ్రప్రజలకు పట్టిన శనిగా మాత్రం అయ్యాడని అనుకుంటున్నారని విమర్శించారు.

ఒక్క రోజులోనే 36 జీఓలు జారీ చేసి అందులో 33 జీఓలను ప్రభుత్వ పోర్టల్ లో పెట్టకుండా దాచి పెడతారా? అంటూ లోకేశ్‌ను ప్రశ్నించారు. దొంగతనం చేసి సీసీ కెమెరాల ఫుటేజిని ఎత్తుకు పోయినట్టు ఉన్నాయి మీ తెలివితేటలు అంటూ మండిపడ్డారు. బందిపోటు దొంగల్లా ప్రజలను ఎన్నాళ్లు దోచుకుంటారని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement