
సాక్షి, విశాఖపట్నం : సుజనా చౌదరిలాగా దొడ్డి దారిన గోడ దూకి వెళ్లే ఎంపీలు తమ దగ్గర లేరని మత్స్యశాఖా మంత్రి మోపిదేవి వెంకట రమణ స్పష్టం చేశారు. సుజనా చౌదరి చేసిన కామెంట్లపై స్పందించిన మంత్రి మోపిదేవి శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. మంత్రి మోపిదేవి మాట్లాడుతూ.. ప్రలోభాలకులోనై పార్టీని వీడి వేరే పార్టీలోకి వెళ్లే నాయకులు తమ పార్టీలో లేరంటూ వ్యాఖ్యానించారు. తమ నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సంపూర్ణ విశ్వాసం ఉందని పేర్కొన్నారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఒక్క ఎంపీ కూడా కదలరని ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రపంచ స్థాయి ఆధ్యాత్మిక కేంద్రమని, వెంకటేశ్వరస్వామి సన్నిధిని ఆర్ధిక వనరుగా భావించే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. టీటీడీ బోర్డు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు కానీ, వాటిపై పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment