టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసింది. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లకు కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈమేరకు చర్య తీసుకుంది. మనీ ల్యాండరింగ్ 2002 చట్టప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను అటాచ్ చేసింది.