attaches properties
-
టీఆర్ఎస్ ఎంపీకి ఈడీ మరో షాక్..
సాక్షి, హైదరాబాద్/ఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా, ఆయన కుటుంబసభ్యులకు సంబంధించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలోని మొత్తం 28 స్థిరాస్తు లను సోమవారం జప్తు చేసింది. వీటి విలువ రూ.80.65 కోట్లు ఉంటుందని స్పష్టం చేసింది. గత జూలైలోనూ నామాకు, ఆయన కుటుంబానికి సంబంధించి రూ.73.74 కోట్ల విలువ గల 105 స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల్లో నుంచి మధుకాన్ గ్రూపు రూ.361.92 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ నిగ్గుతేల్చింది. మధుకాన్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్‌గా, డైరెక్టర్‌గా ఉన్న నామా నాగేశ్వరరావు బ్యాంకుల కన్సార్షియం నుంచి తీసుకునే రుణానికి పూచీకత్తుగా కూడా ఉన్నారని ఈడీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధ్వర్యంలోని ఉషా ప్రాజెక్ట్స్, శ్రీ బీఆర్ విజన్స్, శ్రీధర్మ శాస్త కన్స్ట్రక్షన్స్, శ్రీ నాగేంద్ర కన్స్ట్రక్షన్స్, రాగిణి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, వరలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అనే ఆరు డొల్ల కంపెనీలకు రూ.75.50 కోట్లు మళ్లించారని ఈడీ గుర్తించింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని మధుకాన్ ప్రధాన కార్యాలయం, నగరంలోని మరికొన్ని ఆస్తులతో పాటు ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని ఆ సంస్థ ఆస్తులను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం కాంట్రాక్ట్ రద్దు రాంచీ నుంచి జంషెడ్‌పూర్‌ను కలిపే 163 కిలోమీటర్ల నిడివి గల ఎక్స్‌ప్రెస్ వే అయిన నాలుగు లేన్ల ఎన్‌హెచ్ 33కి సంబంధించి కాంట్రాక్టును మధుకాన్ కంపెనీ పొందింది. ఇందుకోసం 15 బ్యాంకుల కన్సార్షియం రూ.1,151 కోట్ల రుణం మంజూరు చేయగా, అందులోంచి రూ.1,029 కోట్లు మధుకాన్ సంస్థ తీసుకుంది. బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నా ఎక్స్‌ప్రెస్ వే నిర్మాణం పురోగతి లేక, పెద్దఎత్తున నిధులు దుర్వినియోగమైనట్లు, ఆ నిధులను ఇతర అవసరాలకు మళ్లించినట్లు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ గుర్తించింది. దీంతో కన్సార్షి యం బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. జార్ఖండ్ హైకోర్టు సైతం సీబీఐని దర్యాప్తు చేయాలని ఆదేశించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన సంగతి విదితమే. మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో మధుకాన్ కాంట్రాక్టును జాతీయ రహ దారుల సంస్థ రద్దు చేయడంతోపాటు రూ.73.95 కోట్లను స్వాధీనం చేసుకుంది. చదవండి: యువతుల కోసం అపార్ట్‌మెంట్‌కు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఇంతలోనే షాకింగ్ ట్విస్ట్ -
సుజనా చౌదరికి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్: టీడీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) భారీ షాక్ ఇచ్చింది. బ్యాంకులను మోసగించిన కేసులో రూ.315 కోట్ల విలువైన వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను జప్తు చేసింది. షెల్ కంపెనీల పేరుతో బ్యాంకులకు రూ. 364 కోట్లకు కుచ్చుటోపీ పెట్టినట్టు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈమేరకు చర్య తీసుకుంది. మనీ ల్యాండరింగ్ 2002 చట్టప్రకారం హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్స్ ఆస్తులను అటాచ్ చేసింది. పెద్ద డొల్ల కంపెనీలు సృష్టించి నకిలీ ఆస్తులు, బోగస్ ఇన్వాయిస్లతో బ్యాంకులను సుజనా గ్రూప్ బురిడీ కొట్టించినట్టు ఈడీ విచారణలో వెల్లడైంది. చైన్నలోని ఆంధ్రా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును షెల్ కంపెనీలకు తరలించి అక్రమాలకు పాల్పడినట్టు తేలింది. మహల్ హోటల్ అనే డొల్ల కంపెనీని సృష్టించి దీని నుంచి డబ్బును వైస్రాయ్ హోటల్ లిమిటెడ్‌కు తరలించినట్టు దర్యాప్తులో తెలిసింది. పంజాగుట్ట నాగార్జున హిల్స్‌లోని సుజనా గ్రూప్ కార్యాలయం నుంచి కీలక పత్రాలను ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డొల్ల కంపెనీలకు చెందిన 124 నకిలీ రబ్బరు స్టాంపులను కూడా గుర్తించారు. (చదవండి: ‘సుజనా’ క్రియేటివ్స్.. మాయారాజ్యం) -
సుజనా చౌదరికి ఈడీ భారీ షాక్
-
జిగ్నేశ్ షా దెబ్బతో ఎఫ్టీఐఎల్ ఢమాల్
జిగ్నేశ్ షా ప్రమోటడ్ కంపెనీ ఫైనాన్సియల్ టెక్నాలజీస్(ఎఫ్టీఐఎల్) ఆస్తుల అటాచ్ మెంట్ తో, ఆ కంపెనీ కౌంటర్లో షేర్ల అమ్మకం ఊపందుకుంది.ఎఫ్టీఐఎల్ షేరు దాదాపు 17.5 శాతం క్షీణించి, 52 కనిష్టానికి దిగజారింది. ప్రస్తుతం షేరు ధర రూ.70.65గా నమోదవుతోంది. తాజాగా ముంబై ఆర్థిక నేరాల విభాగం ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు చెందిన రూ.2,000 కోట్ల స్థిరాస్తులను స్వాధీన పరుచుకుంది. కంపెనీ బ్యాంకు బ్యాలన్స్ ను ఆర్థిక నేరాల విభాగం అటాచ్ చేసింది. ఎఫ్టీఐఎల్ కు చెందిన అన్ని కార్యాలయాలను ఈ విభాగం స్వాధీనం చేసుకుంటోంది. జిగ్నేశ్ షా అరెస్టు నేపథ్యంలో దిగజారిన షేర్ల పతనం, ఆయన కంపెనీ ఆస్తుల అటాచ్ మెంట్ తో మరింత కుప్పకూలుతున్నాయి. ఇన్వెస్టర్ల పెట్టుబడుల చెల్లింపుల్లో విఫలమైన నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ లిమిటెడ్ సంస్థ ప్రమోటర్ జిగ్నేశ్ షాను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే. రూ.5,600 కోట్ల ఇన్వెస్టర్ల మనీకి నష్టంవాటిల్లేలా చేశారని, ఈ కుంభకోణ పరిశోధనకు ఆయన సరిగ్గా సహకరించనందున షాను అరెస్టు చేశామని ఈడీ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం జిగ్నేశ్ షాపై విచారణ కొనసాగుతోంది. ఎఫ్టీఐఎల్ లో దాదాపు 63వేల మంది షేర్ హోల్డర్స్, 1,000మంది ఉద్యోగులున్నారు. షేర్ హోల్డర్స్, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన అన్ని చట్టపరమైన నివారణలు తీసుకుంటామని కంపెనీ చెబుతోంది. ఈ కేసుకు సంబంధించి త్వరలోనే కోర్టును ఆశ్రయిస్తామని ఓ ప్రకటనలో వెల్లడించింది. ఫైనాన్సియల్ టెక్నాలజీస్ కు ఎన్ఎస్ఈఎల్ సబ్సిడరీ.