రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి టీడీపీ కోవర్టుగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. బీజేపీలోకి ఫిరాయించినా కూడా టీడీపీకి భజనా చేస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన అమర్‌నాథ్.. సుజనా చౌదరి ఎంపీగా ఉంటూ పెద్ద ఎత్తున అవినీతి పాల్పడుతున్నారంటూ మండిపడ్డారు.