Celebrities In Bandar MP Vallabhaneni Balasouri Son Wedding In Udaipur - Sakshi
Sakshi News home page

ఉదయపూర్‌లో ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుని వివాహం

Published Mon, Dec 27 2021 11:02 PM | Last Updated on Tue, Dec 28 2021 9:24 AM

Bandar Mp Balasouri Son Destination Wedding In Udaipur - Sakshi

సాక్షి, కృష్ణాజిల్లా: ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు జామున ఘనంగా జరిగింది. రెండు రోజులు పాటు జరిగిన ఈ వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు  అంగరంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.

ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు.

 రాష్ట్ర మంత్రి పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సీ.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో  ఎండీ చలమల శెట్టి గోపి, ఏఎంఆర్‌ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన  వధూవరులను ఆశీర్వదించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement