Balasouri
-
ఉదయపూర్‌లో ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుని వివాహం
సాక్షి, కృష్ణాజిల్లా: ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ ఉదయపూర్‌లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు జామున ఘనంగా జరిగింది. రెండు రోజులు పాటు జరిగిన ఈ వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి. ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు. రాష్ట్ర మంత్రి పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సీ.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో ఎండీ చలమల శెట్టి గోపి, ఏఎంఆర్ గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. -
వైభవంగా ఎంపీ బాలశౌరి కుమారుడి వివాహం
-
ఘనంగా ఎంపీ బాలశౌరి కుమారుడి నిశ్చితార్థం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
-
ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరీ లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12 శాతానికి తగ్గించిన జీఎస్టీని.. సున్నాశాతం స్లాబ్‌లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్స్‌లపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకు సున్నాశాతం స్లాబ్‌ను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని అత్యవసరంగా సమావేశపరచాలని లేఖలో కోరారు. -
నిమ్మగడ్డ.. ఎందుకంత మొండి వైఖరి..
సాక్షి, విజయవాడ: స్థానిక ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ మొండిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘ఉద్యోగులు, ప్రజల ప్రాణానికో న్యాయం.. మీ ప్రాణానికి మరొక న్యాయమా?. ఉద్యోగులంతా ఫ్రంట్‌లైన్ వారియర్స్ అని తెలియదా?. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు వ్యాక్సిన్ తప్పనిసరి అని కేంద్రం చెప్పింది. కేంద్రం రూల్స్ అంటే నిమ్మగడ్డకు లెక్కలేదా?. దీనిపై వివరణ ఇవ్వకుండా ఎందుకు తప్పించుకుంటున్నారంటూ’’ బాలశౌరి విమర్శలు గుప్పించారు. చదవండి: నిమ్మగడ్డ తీరు.. విమర్శల జోరు కరోనా సమయంలో ఎన్నికలు వద్దని ఉద్యోగులు మొర పెట్టుకుంటున్నారని.. వారి అభ్యర్థనను నిమ్మగడ్డ పెడచెవిన పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో విడత వ్యాక్సిన్ అత్యంత ముఖ్యమని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందన్నారు. కోర్టులు కూడా వర్చువల్‌గానే పనిచేస్తున్నాయని.. నిమ్మగడ్డ కూడా ఎస్ఈసీ తరఫున వర్చువల్‌గా హాజరయ్యారని’’ ఎంపీ బాలశౌరి తెలిపారు. చదవండి: మూడేళ్లు నిద్రపోయి.. ఇప్పుడెందుకు తొందర..! -
పాదయాత్రలో ఇచ్చిన హామీ కన్నా మిన్నగా
సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో 23 వేల ఇళ్లు ఇస్తున్నామంటే అది సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి ఫలితమే అని వైఎస్సార్సీపీ ఎంపీ బాల శౌరి అన్నారు. పేదల కోసం సీఎం జగన్ చేసిన యజ్ఞం ఫలించిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ కన్నా మిన్నగా సీఎం జగన్ పేదలకు ఇళ్లు కేటాయించారని గుర్తుచేశారు. 30లక్షల 70 వేల ఇళ్లు ఇచ్చి ఒక్క అడుగు ముందుకు వేశారని తెలిపారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని, సీఎం జగన్ ఒక్క రూపాయికే ఇళ్లు ఇచ్చిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 170 సీట్లు ఖాయంగా వైఎస్సార్సీపీ గెలుస్తుందన్నారు. రూ.450కోట్లతో పెనమలూరు నియోజకవర్గంలో సీఎం జగన్ 23వేల ఇళ్లు కట్టించనున్నారని తెలిపారు. మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్ చెప్పాడంటే చేస్తారని, ఇళ్ల నిర్మాణం ద్వారా అనేక మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు. -
‘బాబు కంటే రాబందులు నయం’
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో కూర్చొని ఆంధ్రప్రదేశ్‌పై రాళ్లు విసురుతున్నారని మచిలిపట్నం వైఎస్స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ విస్తరిస్తున్న సంక్షోభ సమయంలో నాయకత్వ లక్షణాల గురించి చంద్రబాబు చెప్పటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆయన మాటల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు సంక్షోభం రాగానే హెరిటేజ్‌లో పాల ధరను రూ.4లకు పెంచడం నాయకత్వమా అని బాలశౌరి ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడంలో చంద్రబాబు కంటే రాబందులు నయమని ఎంపీ బాలశౌరి దుయ్యబట్టారు. -
త్వరలోనే బందరు పోర్టు పనులు ప్రారంభం
సాక్షి, చిలకలపూడి (మచిలీపట్నం): బందరు పోర్టు పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని, నాలుగేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామని మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పునరుద్ఘాటించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కార్యాలయంలో ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే గిట్టని వారు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు పోర్టు నిర్మాణం నిలిచిపోతోందని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పోర్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధితో ఉన్నారన్నారు. నాలుగైదు బెర్త్‌లు నిర్మించేందుకు ఎక్కువ నిధులు కూడా అవసరం లేదని ఆయన తెలిపారు. కంటైనర్ కార్పొరేషన్ సంస్థ పోర్టు నిర్మాణంలో కలిపి పనిచేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఇందుకోసం అన్ని అనుమతులు ఉన్నాయని ఆయన వివరించారు. త్వరితగతిన నిర్మాణ పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించి ఆర్థిక అభ్యంతరాలను తొలగించనున్నామని తెలిపారు. అలాగే స్థానికులకు 75 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. డ్యామ్‌లు నిండుతున్నాయి: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన కొద్దిరోజుల్లోనే దేవుని చలువతో డ్యామ్‌లు అన్ని నీటితో కళకళలాడుతున్నాయని ఎంపీ బాలశౌరి అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ నిండిని తర్వాత పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రెండో పంటకు కూడా నీటి సమస్య రాకుండా రైతులు సంతోషంగా ఉండేలా చేస్తామని చెప్పారు. పంటలకు మంచి గిట్టుబాటు ధర కూడా వస్తుందని పూర్తి విశ్వాసంతో ఉన్నామన్నారు. ఆరు లైన్ల రహదారులకు నూతన ప్రతిపాదనలు.. కృష్ణా జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ, వాతావరణ కాలుష్య నియంత్రణ కోసం ఆరు లైన్ల రహదారుల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి ప్రతిపాదనలు అందించినట్లు ఎంపీ తెలిపారు. గుండుగొలను నుంచి కలపర్రు వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 505.40 కోట్లు, కలపర్రు నుంచి చినఅవుటుపల్లి వరకు 27.4 కిలోమీటర్లకు రూ. 512.43 కోట్లు, చినఅవుటుపల్లి – గొల్లపూడి వరకు 30 కిలోమీటర్లకు రూ. 752.15 కోట్లు, గొల్లపూడి నుంచి చినకాకాని వరకు మధ్యలో కృష్ణా నది ఐకానిక్ బ్రిడ్జితో సహా 17.8 కిలోమీటర్లకు రూ. 1,215.19 కోట్లతో ప్రతిపాదనలు ఇచ్చినట్లు చెప్పారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ నాయకులు బూరగడ్డ రమేష్‌నాయుడు, ఉప్పాల రాంప్రసాద్, రాజులపాటి అచ్యుతరావు, తిరుమాని శ్రీనివాసరావు, బండారు చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. -
‘చంద్రబాబు బయోపిక్.. మహానగరంలో మాయగాడు’
-
‘చంద్రబాబు బయోపిక్.. మహానగరంలో మాయగాడు’
సాక్షి, హైదరాబాద్ : దివంగత ముఖ్యమంత్రులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్, జయలలితల బయోపిక్‌లు తెరకెక్కుతున్నాయని, ఈ తరుణంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బయోపిక్ కూడా తీస్తే ‘మహానగరంలో మాయగాడు‘.. ‘యూటర్న్ మోసగాడు’ అనే పేర్లు పెట్ట వచ్చని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత బాలశారి ఎద్దేవా చేశారు. సోమవారం పార్టీ కేంద్రకార్యలయంలో మీడియాతో మాట్లాడుతూ.. 2019లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, ఆయన కొడుకు లోకేష్ ప్రజల చెవుల్లో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 9 శ్వేత పత్రాలు విడుదల చేసిన చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎన్ని కోట్లతో కొనుగోలు చేశారో చెప్పాలన్నారు. మ్యానిఫెస్టో అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హైకోర్ట్ కట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారని, హైకోర్టు కట్టలేక సాకులు వెతుకుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మ పోరాట దీక్షకు అర్ధం లేకుండా చేశారని దుయ్యబట్టారు. గతంలో సోనియాను దెయ్యమన్న చంద్రబాబుకు ఇప్పుడు ఆమె అలా కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. కానీ చంద్రబాబు అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారని, ఒంటరిగా పోటీ చేసే సత్తా తమ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఉందన్నారు. అప్పుడెందుకు ముసిముసిగా నవ్వావు? తెలంగాణ సీఎం కేసీఆర్ మాటల్లో భావం కరెక్ట్‌గానే ఉందని, జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు చంద్రబాబు ఎందుకు ముసిముసిగా నవ్వాడని, ఇది మీ సంస్కారమా? అని ప్రశ్నించారు. అప్పుడు జేసీ వ్యాఖ్యలను ఎందు ఖండించలేదని నిలదీశారు. విలేకరుల సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, చంద్రబాబు నాయుడి తీరును ప్రస్తావిస్తూ.. ఘాటైన విమర్శలు చేయడం.. ఈ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ కేసీఆర్ సభ్యత లేకుండా మాట్లాడారని వ్యాఖ్యానించడం తెలిసిందే. -
ఎన్నికలకు వైఎస్ఆర్ సిపి రెడీ
-
జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిశా: బాలశౌరి
హైదరాబాద్ : తెనాలి మాజీ ఎంపీ బాలశౌరి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్‌గూడ జైల్లో కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జగన్‌ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని చక్కదిద్దే సత్తా ఒక్క జగన్‌కే ఉందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు బాలశౌరి ప్రకటించారు. బాలశౌరితో పాటు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాలశౌరీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గత నెల మొదటివారంలోనే రాజీనామ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు కూడా ప్రకటించారు.