సాక్షి, కృష్ణా: జిల్లాలోని పెనమలూరు నియోజకవర్గంలో 23 వేల ఇళ్లు ఇస్తున్నామంటే అది సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కృషి ఫలితమే అని వైఎస్సార్‌సీపీ ఎంపీ బాల శౌరి అన్నారు. పేదల కోసం సీఎం జగన్ చేసిన యజ్ఞం ఫలించిందన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ కన్నా మిన్నగా సీఎం జగన్ పేదలకు ఇళ్లు కేటాయించారని గుర్తుచేశారు. 30లక్షల 70 వేల ఇళ్లు ఇచ్చి ఒక్క అడుగు ముందుకు వేశారని తెలిపారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక్క రూపాయి డాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారని, సీఎం జగన్ ఒక్క రూపాయికే ఇళ్లు ఇచ్చిన నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 170 సీట్లు ఖాయంగా వైఎస్సార్‌సీపీ గెలుస్తుందన్నారు. రూ.450కోట్లతో పెనమలూరు నియోజకవర్గంలో సీఎం జగన్ 23వేల ఇళ్లు కట్టించనున్నారని తెలిపారు. మడమ తిప్పని నాయకుడు సీఎం జగన్ చెప్పాడంటే చేస్తారని, ఇళ్ల నిర్మాణం ద్వారా అనేక మందికి ఉపాధి దొరుకుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment