
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో కూర్చొని ఆంధ్రప్రదేశ్‌పై రాళ్లు విసురుతున్నారని మచిలిపట్నం వైఎస్‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ విస్తరిస్తున్న సంక్షోభ సమయంలో నాయకత్వ లక్షణాల గురించి చంద్రబాబు చెప్పటం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఆయన మాటల తీరు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయని ఎద్దేవా చేశారు.
ప్రజలకు సంక్షోభం రాగానే హెరిటేజ్‌లో పాల ధరను రూ.4లకు పెంచడం నాయకత్వమా అని బాలశౌరి ప్రశ్నించారు. ప్రజలను దోచుకోవడంలో చంద్రబాబు కంటే రాబందులు నయమని ఎంపీ బాలశౌరి దుయ్యబట్టారు.