జగన్ను మర్యాదపూర్వకంగానే కలిశా: బాలశౌరి | Ex-MP Vallabhaneni Balasouri meets YS Jagan mohan reddy, to join YSR Congress party | Sakshi
Sakshi News home page

జగన్ను మర్యాదపూర్వకంగానే కలిశా: బాలశౌరి

Published Fri, Sep 13 2013 12:33 PM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

జగన్ను మర్యాదపూర్వకంగానే కలిశా: బాలశౌరి - Sakshi

జగన్ను మర్యాదపూర్వకంగానే కలిశా: బాలశౌరి


హైదరాబాద్ : తెనాలి మాజీ ఎంపీ బాలశౌరి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చంచల్గూడ జైల్లో కలిశారు. భేటీ అనంతరం ఆయన మాట్లాడుతూ తాను జగన్ను మర్యాదపూర్వకంగానే కలిసినట్లు తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత రాష్ట్రంలో ఏర్పడ్డ పరిస్థితుల్ని చక్కదిద్దే సత్తా ఒక్క జగన్కే ఉందన్నారు. త్వరలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు బాలశౌరి ప్రకటించారు. బాలశౌరితో పాటు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు.

రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాలశౌరీ  కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి గత నెల మొదటివారంలోనే రాజీనామ చేశారు.  లోక్సభ ఎన్నికల్లో వల్లభనేని బాలశౌరి తెనాలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఇటీవల గుంటూరులో చేపట్టిన సమర దీక్షకు బాలశౌరి మద్దతు కూడా ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement