Department of Archaeological Survey of India
-
రత్న భండార్‌లో రెండో సర్వే ప్రారంభం
పూరీ: భారత పురావస్తు సర్వే విభాగం(ఏఎస్ఐ) ఒడిశా పూరీ జగన్నాథ ఆలయంలోని రత్న భండార్‌లో శనివారం మధ్యాహ్నం రెండో దఫా టెక్నికల్ సర్వే ప్రారంభించింది. మూడు రోజులపాటు ఈ సర్వే కొనసాగుతుందని, మధ్యాహ్నం ఒంటి నుంచి సాయంత్రం 6 గంటల ద్వారా భక్తులను ఆలయంలోకి అనుతించబోమని శ్రీజగన్నాథ్ ఆలయ పరిపాలనా విభాగం అధికారులు వెల్లడించారు. సర్వే జరుగుతున్న సమయంలో ఆలయ ప్రధాన ద్వారాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. రత్న భండార్‌లో రహస్య గది గానీ, సొరంగం గానీ ఉన్నా యా? అనేది తేల్చబోతున్నామని రత్న భండార్ ఇన్వెంటరీ కమిటీ చైర్మన్ జస్టిస్ బిశ్వనాథ్ రథ్ చెప్పారు. ఈ సర్వే కోసం అత్యాధునిక రాడార్‌ను ఉపయోగిస్తున్న ట్లు వివరించారు. రత్న భండార్‌లో మొదటి దఫా సర్వే ఇప్పటికే పూర్తయ్యింది. -
తాజ్ మహల్‌కు ప్రకృతి చికిత్స!
న్యూఢిల్లీ: మన ముఖ వర్చస్సు తగ్గితే ఏం చేస్తాం... కొంత మంది అయితే, ఏవేవో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటారు. కొందరు సహజసిద్ధంగా ముల్తానా మట్టిని ముఖంపై ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవడం చేస్తారు. దీనివల్ల వారి ముఖంలో కొత్త వెలుగు వస్తుంది. అచ్చం అలాగే, ప్రముఖ కట్టడం తాజ్ మహల్‌కు బురదమన్నుతో త్వరలోనే చిక్సిత చేయనున్నారు. పెరిగి పోయిన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ పాలరాతి అందాలు పసుపురంగులోకి మారుతున్నాయి. దీంతో కాలుష్యాన్ని తొలగించేందుకు భారత పురావస్తు విభాగం రంగంలోకి దిగింది. తాజ్‌మహల్ సహజ అందాలను తిరిగి తీసుకొచ్చేందుకు మడ్పాక్(మట్టిపూత)తో చికిత్స చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది. నిమ్మగుణం అధికంగా ఉన్న మట్టిని తాజ్ మహల్‌పై, తెల్లదనం తగ్గిన చోట పూతలా వేసి ఆరిన తర్వాత మట్టిపూతను తీసే సి మెత్తటి నైలాన్ బ్రష్‌లతో డిస్టిల్డ్ వాటర్‌తో ఆయా ప్రాంతాల్లో కడుగుతారు. ఈ కట్టడానికి 1994, 2001, 2008లోనూ ఇలానే చికిత్స చేశారు.