‘రెండు’కు రెడీ.. | telangana ZPTC And MPTC Elections Second Phase Nominations | Sakshi
Sakshi News home page

‘రెండు’కు రెడీ..

Published Fri, Apr 26 2019 7:48 AM | Last Updated on Fri, Apr 26 2019 7:48 AM

telangana ZPTC And MPTC Elections Second Phase Nominations - Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం:  జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి రెండో విడత నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. మొదటి విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం బుధవారం పూర్తి కావడంతో రెండో విడత నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో మే 10వ తేదీన జరిగే రెండో విడత ఎన్నికల్లో 6 జెడ్పీటీసీ, 85 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగనుండగా.. ప్రతి రోజు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈనెల 29వ తేదీన అధికారులు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించనున్నారు.

తిరస్కరణకు గురైన అభ్యర్థులు 30వ తేదీన తగిన ఆధారాలతో అధికారులకు అప్పీల్‌ చేసుకునే అవకాశం కల్పించారు. మే 2వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. అదేరోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. మే 10వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. అయితే ప్రధాన రాజకీయ పక్షాలు పరిషత్‌ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించాయి. అభ్యర్థుల ఎంపిక.. నామినేషన్లు వేయించడంపై కసరత్తు చేస్తున్నాయి. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో గ్రామాల్లో ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది.

రెండో విడతలో ఎన్నికలు జరిగే మండలాలివే.. మండలం : ఏన్కూరు 
ఎంపీటీసీ స్థానాలు–10.. బురదరాఘవాపురం, భద్రుతండా, ఏన్కూరు–1, ఏన్కూరు–2, జన్నారం, కేసుపల్లి, రేపల్లెవాడ, శ్రీరామగిరి, టీఎల్‌.పేట, తిమ్మారావుపేట. 
 మండలం : కల్లూరు 
ఎంపీటీసీ స్థానాలు–18.. బాతుపల్లి, చండ్రుపట్ల, చెన్నూరు–1, చెన్నూరు–2, చిన్నకోరుకొండి, కల్లూరు–1, కల్లూరు–2, కల్లూరు–3, కప్పలబంధం, లింగాల, మర్లపాడు, ముచ్చవరం, నారాయణపురం, పెద్దకోరుకొండి, పేరువంచ, పుల్లయ్య బంజర, తాళ్లూరు, ఎర్రబోయినపల్లి. 
 మండలం : పెనుబల్లి 
ఎంపీటీసీ స్థానాలు–15.. చింతగూడెం, గణేష్‌పాడు, గౌరారం, కరాయిగూడెం, కోండ్రుపాడు, కుప్పెనకుంట్ల, లంకపల్లి, లింగగూడెం, మండాలపాడు, పెనుబల్లి, రామచంద్రరావు బంజర, టేకులపల్లి, తాళ్లపెంట, వీఎం.బంజర, ఏరుగట్ల. 
 మండలం : సత్తుపల్లి 
ఎంపీటీసీ స్థానాలు–13.. బేతుపల్లి, బుగ్గపాడు, చెరుకుపల్లి, గంగారం, కాకర్లపల్లి, కిష్టాపురం, కిష్టారం, రామగోవిందాపురం, రామనగరం, రేజర్ల, రుద్రాక్షపల్లి, సిద్ధారం, తుంబూరు. 
 మండలం : తల్లాడ 
ఎంపీటీసీ స్థానాలు–16.. అన్నారుగూడెం–1, అన్నారుగూడెం–2, బిల్లుపాడు, కలకొడిమ, కొడవటిమెట్ట, కుర్నవల్లి, మల్లారం, మిట్టపల్లి, ముద్దునూరు, నూతనకల్, పినపాక, రామానుజవరం, తల్లాడ–1, తల్లాడ–2, తల్లాడ–3, వెంగన్నపేట. 
 మండలం : వేంసూరు 
ఎంపీటీసీ స్థానాలు–13.. అడసర్లపాడు, భీమవరం, చౌడవరం, దుద్దెపుడి, జయలక్ష్మీపురం, కల్లూరుగూడెం, కందుకూరు, కుంచపర్తి, లచ్చన్నగూడెం, మర్లపాడు, రామన్నపాలెం, వి.వెంకటాపురం, వేంసూరు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement