టెక్స్‌టైల్స్‌ రంగానికి రెండో విడత పీఎల్‌ఐ | Centre Looking At PLI 2. 0 For Textiles To Make The Sector Globally Competitive | Sakshi
Sakshi News home page

టెక్స్‌టైల్స్‌ రంగానికి రెండో విడత పీఎల్‌ఐ

Published Thu, Nov 3 2022 6:38 AM | Last Updated on Thu, Nov 3 2022 6:38 AM

Centre Looking At PLI 2. 0 For Textiles To Make The Sector Globally Competitive - Sakshi

న్యూఢిల్లీ: టెక్స్‌టైల్స్‌ రంగానికి రెండో విడత ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని (పీఎల్‌ఐ) పరిశీలిస్తున్నట్టు కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. టెక్స్‌టైల్స్‌ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న చైనా, వియత్నాం దేశాలతో పోటీపడేందుకు ఇది పరిశ్రమకు మద్దతుగా నిలుస్తుందని. టెక్స్‌టైల్స్‌ రంగానికి ప్రకటించిన పీఎల్‌ఐ పథకం పనితీరుపై ఆ శాఖ వ్యవహరాలను చూస్తున్న గోయల్‌ సమీక్షించారు.

టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐ 2.0 ప్రకటించానికి ముందు భాగస్వాములతో విస్తృత సంప్రదింపులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పరిశ్రమ అంతర్జాతీయ మార్కెట్లో బలమైన పోటీనిచ్చే విధంగా పీఎల్‌ఐ 2.0ని రూపొందించాలన్నారు. అధిక విలువ కలిగిన ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు సూచించారు. ఉపాధి అవకాశాల కల్పనకు, ఎగుమతులు, వృద్ధి బలోపేతానికి తగినన్ని సామర్థ్యాలు టెక్స్‌టైల్స్‌ పరిశ్రమకు ఉన్నట్టు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement