ఇదీ ప్రాదేశిక షెడ్యూల్ | Spatial elections scedul finalized | Sakshi
Sakshi News home page

ఇదీ ప్రాదేశిక షెడ్యూల్

Published Fri, Mar 28 2014 1:15 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

Spatial elections scedul  finalized

 నల్లగొండ, న్యూస్‌లైన్ ప్రాదేశిక ఎన్నికల షెడ్యూల్ ఎట్టకేలకు ఖరారైంది. వివిధ కారణాల దృష్ట్యా ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహించాలని జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్‌కు ప్రతిపాదనలు పంపారు. ఈ మేర కు రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి గురువారం ఎన్నికల కమిషన్ ఆమోదం తెలిపింది. కానీ తొలుత ప్రతిపాదించిన ప్రకారం కాకుండా ఎన్నికల తేదీల్లో మార్పులు చేశారు. మొదటి విడత పోలింగ్  యధావిధిగానే ఏప్రిల్ 6 తేదీన నిర్వహిస్తారు.

 

రెండో విడత పోలింగ్ మాత్రం ఏప్రిల్ 8న కాకుండా 11వ తేదీకి వాయిదా వేశారు. 8న శ్రీరామనవమి పండుగ ఉన్నందున రెండో విడత పోలింగ్‌ను వాయిదా వేయాల్సి వచ్చింది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 11న కాకుండా మే 7 తేదీ తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు. ప్రాదేశిక ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై పడకుండా ఉండేందుకు ఈ మార్పు చేయాల్సి వచ్చింది. మే 7 తేదీ నాటికి సార్వత్రిక ఎన్నికలు పూర్త్తవుతాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement