భువనగిరిలో టాప్‌గేర్
- లోక్‌సభ పరిధిలోని ఐదు సెగ్మెంట్లలో
- గులాబీ గుబాళింపు ఎంపీలు, ఎమ్మెల్యేలకు తగ్గని మెజార్టీ
సత్తాచాటిన టీఆర్‌ఎస్
ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీగా టీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ బూరనర్సయ్యగౌడ్‌కు 4,48,245 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజ గోపాల్‌రెడ్డికి 4,17.751 ఓట్లు పడడంతో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 39, 494 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో టీఆర్‌ఎస్‌కు ఐదు సెగెంట్లలో 3,38,746 ఓట్లు సాధించారు. మునుపెన్నడూ లేనివిధంగా టీఆర్‌ఎస్ ప్రభంజనం వీచడంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీజేపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. జిల్లాలో టీఆర్‌ఎస్ తన సత్తాను చాటుకుంది.
భువనగిరి, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోయింది.పార్లమెంట్ పరిధిలోకి వచ్చే భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేక ల్ నియోజకవర్గాల్లో కారు టాప్‌గేర్ స్పీడుకు హస్తం బ్రేక్ వేయలేకపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్‌ఎస్‌కు పట్టున్న ఆలేరుతోపాటు మిగతా నాలుగు నియోజకవర్గాల్లో కారు స్పీడు జోరందుకుంది. తొలిసారి జరి గిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ గుబాళించింది.
జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ స్థానాలను భువనగిరి డివిజన్‌లో మెజార్టీగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆలేరులో టీఆర్‌ఎస్ తొలిసారిగా విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్‌ఎస్ తరుపున డాక్టర్ నగేష్ గెలిచారు. 2009 ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో ఆలేరు, నకిరేకల్, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తుంగతుర్తి, భువనగిరిలో టీడీపీ, మునుగోడులో సీపీఐ మహా కూటమి అభ్యర్థులు విజయం సాధిం చారు. ఆ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానానికి మ హా కూటమి అభ్యర్థి నోముల నర్సింహయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు.