general elections results
-
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సమీక్ష
-
ప్రతిపక్షం నుంచే పోరాడదాం: వైఎస్ జగన్
విశాఖ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి నుంచే క్యాడర్‌ను బలోపేతం చేయాడానికి అందరూ కృషి చేయాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నుంచే పోరాడదామని ఆయన అన్నారు. విశ్వప్రియ ఫంక్షన్హాల్లో జరుగుతున్న ఈ సమీక్షలో తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా జగన్ సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. -
విశాఖలో వైఎస్ జగన్‌కు ఘన స్వాగతం
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం విశాఖ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు విశాఖ విమానాశ్రయంలో పార్టీ కార్యకర్తలు, నేతలు,అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. విశ్వప్రియ ఫంక్షన్హాల్లో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ రెండు రోజుల పాటు సమీక్ష జరుపుతారు. బుధవారం తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా ఆయన సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. -
నేడు విశాఖకు వైఎస్ జగన్
-
నేడు విశాఖకు వైఎస్ జగన్
‘సార్వత్రిక ఎన్నికల ఫలితాల’పై రెండు రోజులపాటు సమీక్ష సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి బుధవారం విశాఖపట్నం వెళుతున్నారు. అక్కడ ఆయన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బుధ, గురువారాల్లో జరిగే పార్టీ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. బుధవారం తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు. -
ఓటమిపై ‘పోల్’మార్టం
- పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న నేతలు - తప్పిన లెక్కలపై బేరీజు - నష్టమెక్కడో వెతుకులాట వరంగల్, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికల ఓటమిపై ప్రధాన పార్టీల అభ్యర్థుల పోస్ట్‌మార్టం మొదలైంది. గెలుపుపై పూర్తి విశ్వాసంతో ఉన్న నేతలైతే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకిలా జరిగిందని మథన పడుతున్నారు. ఫలితాలు వెల్లడై ఎక్కడెక్కడ ఎన్ని ఓట్లు వచ్చాయో తేలిడంతో లోటుపాట్లపై బేరీజు వేసుకుంటున్నారు. నమ్మకమైన పార్టీ నాయకులు, అనుచరులతో జరిగిన నష్టంపై చర్చల్లో నిమగ్నమయ్యారు. ఓడిపోయిన నేతల ఇళ్ల వద్ద ఓదార్పులు, ఇలా చేసుంటే బాగుండేదనే నిట్టూర్పులు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్, టీడీపీ నేతల్లో ఈ ఆందోళన స్పష్టంగా కనిపిస్తుండగా గులాబీ గాలివీచినా గెలవకపోవడంపై టీఆర్ఎస్ నాయకుల్లో నిరాశ వ్యక్తమవుతోంది. ఇక మోడీ ప్రభంజనంలోనూ ఓటమి మూటగట్టుకోవడంపై బీజేపీ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. కాంగ్రెస్‌లో నిర్వేదం ఓటమిపాలైన కాంగ్రెస్ నేతల్లో నిర్వేదం కనిపిస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామలో ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు ఒక్కసారిగా నీరుగారిపోయారు. టీపీసీసీ అధ్యక్షుడిగా గెలిస్తే తెలంగాణ సీఎం అయ్యే అవకాశాలున్నాయనే ప్రచారం జరిగినా పొన్నాల ఓటమి చెందడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. వరంగల్ తూర్పులో బలమైన నేతగా ఉన్న సారయ్య భారీ మెజార్టీతో ఓటమిపాలవడం తట్టుకోలేకపోతున్నారు. ఎన్నికలను ఎదుర్కొవడంలో ఎంతో అనుభవం ఉన్న ఆయన వ్యవహరించిన తీరు అతివిశ్వాసమా? అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. నిన్నటి వరకు కాంగ్రెస్‌కు బలమైన ప్రాంతాలుగా ఉన్న చోట్ల కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా ఓటింగ్ జరగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. భూపాలపల్లిలో మాజీ చీఫ్‌విప్ గండ్రను తెలంగాణవాదం కొంపముంచింది. ఆయన సర్వశక్తులొడ్డినప్పటికీ కోల్‌బెల్ట్‌లో నష్టం జరిగింది. దీనికి స్థానిక నాయకుల అతివిశ్వాసమే కారణమంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత ఎదురైనప్పటికీ సకాలంలో సరిదిద్దుకోలేక పోవడంతో పరిస్థితి చేయిదాటిపోయిందనే చర్చ పార్టీ వర్గాల్లోసాగుతోంది. హోరాహోరీ పోరులో పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి దుగ్యాల ఓటమిచెందడంతో కార్యకర్తల్లో తీవ్ర నిరాశ వ్యక్తమవుతోంది. తెలంగాణ అనుకూల వాతావరణంలో టీడీపీ చేతిలో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మహబూబాబాద్‌లో కవిత తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ పార్టీలో అంతర్గతంగా ఉన్న గ్రూపులు, వర్ధన్నపేటలో శ్రీధర్‌కు, ములుగులో వీరయ్యకు ప్రభుత్వ వ్యతిరేకత దెబ్బతీసినట్లు భావిస్తున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో విజయరామారావు, వరంగల్ పశ్చిమలో స్వర్ణ, పరకాలలో వెంకట్రాంరెడ్డి, నర్సంపేటలో వెంకటస్వామిప్రజాభిమానాన్ని పొందలేక పోయారంటున్నారు. గులాబీల్లో ఆవేదన గులాబీ పవనాలు వీచినప్పటికీ విజయం సాధించకపోవడంతో నర్సంపేట టీఆర్ఎస్ శ్రేణుల్లో నిర్వేదం వ్యక్తమవుతోంది. ఉద్యమంలో కీలక పాత్ర వహించిన పెద్ది సుదర్శన్‌రెడ్డికి ఇక్కడ ప్రజల్లో పట్టున్నప్పటికీ ఓటమిపాలు కావడం మింగుడుపడడంలేదు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత స్థానంలో సానుభూతి పవనాలు వీయడంతో ఓటమితప్పలేదు. అనుభవరాహిత్యం ఇక్కడ నష్టం చేసిందంటున్నారు. పాలకుర్తిలో సుధాకర్‌రావు సానుకూల వాతావరణానికి తగిన విధంగా ఎత్తులు వేయకపోవడం, ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కొలేకపోవడం వల్లే కారు పరుగులు తీసిందంటున్నారు. పరకాలలో సహోదర్‌రెడ్డికి పట్టులేక పోవడంతో నష్టం వాటిల్లింది. పార్టీలో గ్రూపులు కొంత నష్టం చేశాయి. పరకాల పట్టణంలో పట్టుకోల్పోవడం టీఆర్ఎస్ను దెబ్బతీసిందని భావిస్తున్నారు. డోర్నకల్‌లో పార్టీ మారినప్పటికీ ఇక్కడ గులాబీ బలంగా లేకపోవడంతో నష్టం వాటిల్లింది. ఓటుమార్పులో లోటుపాట్లతో సత్యవతి ఓటమితప్పలేదంటున్నారు. టీడీపీ విఫలం నర్సంపేటలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రేవూరి తెలంగాణ ఉద్యమ సమయంలో చంద్రబాబు అనుసరించిన తీరుకు తగిన విధంగా స్పందించకపోవడంతో జరగాల్సిన నష్టం జరిగిందనే వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ రాజకీయ దాడితో కేడర్‌లో ఆత్మవిశ్వాసం నింపలేక చతికిలపడ్డామనే అంచనాకు వచ్చారు. ములుగులో పార్టీపై వ్యతిరేకత సీతక్క ఓటమికి కారణమైంది. అయితే పార్టీని తిరిగి పట్టాలెక్కించే సత్తా తనకుందనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేడర్‌లో విశ్వాసం పెంచేయత్నం చేస్తున్నారు. మహబూబాబాద్, డోర్నకల్‌లలో టీడీపీ అభ్యర్థులు బాలుచౌహాన్, రామచంద్రునాయక్‌ల ప్రయోగం ఫలించలేదు. పార్టీ కేడర్‌లో ఆత్మవిశ్వాసం పెంచలేకపోయారు. బీజేపీకి కలిసిరాని పొత్తు టీడీపీతో పొత్తు జిల్లాలో కలిసిరాలేదనే అభిప్రాయం బీజేపీ అభ్యర్థులో ఉంది. తూర్పు, పశ్చిమ, జనగామ, భూపాల్పల్లి నుంచి బరిలో నిలిచిన రావు పద్మ, ధర్మారావు, ప్రతాపరెడ్డి, సత్యనారాయణరావుల్లో ఆవేదన నెలకొంది. ఓట్ల మార్పు సాధ్యం కాలేదంటున్నారు. ఇక టీడీపీ ఏ మేరకు సహకరించిందో పోస్ట్‌మార్టమ్ చేస్తున్నారు. టీడీపీపై వ్యతిరేకత తమకు నష్టం చేసిందనే అంచనాకొచ్చారు. -
ఇచ్చిన హామీలు నెరవేరుస్తా
- త్వరలో కేసీఆర్‌తో మెడికల్ కాలేజీకి శంకుస్థాపన - పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయిస్తా - నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరందించడమే ధ్యేయం - నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ టుటౌన్, న్యూస్‌లైన్, పదిహేనేళ్ల కాలంలో చేసిన అభివృద్ధి ఒక ఎత్తు.. ఈ ఐదేళ్ల కాలంలో చేసే అభివృద్ధి మరో ఎత్తు.. అని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సందర్భంలో ఇచ్చిన ప్రతి హామీని దశలవారీగా అమలు చేసి నల్లగొండను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. శనివారం పట్టణం లో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ అనంతరం క్లాక్‌టవర్ సెంటర్లో నిర్వహించిన సభలో కోమటిరెడ్డి మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయగానే తొలుత నల్లగొండ జిల్లా కేంద్రానికి తీసుకవచ్చి మెడికల్ కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయిస్తానని చెప్పారు. రేయింబవళ్లు ప్రజలకు అందుబాటులో ఉంటూ జిల్లా అభివృద్ధికి కృషిచేస్తానన్నారు. తన చిరకాల వాంఛ అయిన శ్రీశైలం సొరంగమార్గంతో పాటు బ్రహ్మణ వెల్లెంల ప్రాజెక్టును పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే తన ధ్యేయమన్నారు. శ్రీశైలం సొరంగ మార్గానికి గతంలోనే *2వేల కోట్లు మంజూరు చేయించానని, పనులు పూర్తి చేయించి, సాగునీరు అందిస్తానని చెప్పారు. నీరు వస్తేనే రైతులు బాగుంటారు. కూలీలు అభివృద్ధి చెందుతారన్నారు. ఎవరూ ముఖ్యమంత్రిగా ఉన్నా మనం గౌరవించాలని ప్రజా తీర్పును తప్పకుండా గౌరవిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రం లోనూ నల్లగొండ నియోజకవర్గాన్ని మోడల్ సీటీగా తీర్చిదిద్దుతానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన మరుసటి రోజే నల్లగొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ కోసం 32 కోట్లు మంజూరుకు సచివాలయంలో అధికారులతో మాట్లాడనని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఉత్తర్వులు జారీ కానున్నాయని తెలిపారు. ఆపదలో ఉన్న వారు తన ఇంటికి వస్తే అండగా ఉంటానన్నారు. త్వరలోనే నల్లగొండ పట్టణ శివారులో పేదలకు 5వేల ఇళ్లు కట్టిస్తానని చెప్పారు. జిల్లా కేంద్ర సమీపంలో ఐటీ కంపెనీలు తీసుకువచ్చి యువతకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. నల్లగొండ శాసనసభ్యుడిగా మరోమారు గెలిపించిన నియోజకవర్గం ప్రజల రుణం ఎన్ని జన్మలకైనా తీర్చుకోలేనన్నారు. తనకు ఓటు వేసిన ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని పేర్కొన్నారు. నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య, తుంగతుర్తిలో అద్దంకి దయాకర్ 1000, 1500, భువనగిరిలో తన సోదరుడు రాజగోపాల్క్షరెడ్డి స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం బాధకలిగించిందన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుల్లెంల వెంకటనారాయణగౌడ్, బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, అబ్బగోని కవిత, కేశాని కవిత, బొడ్డుపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
భువనగిరిలో టాప్‌గేర్
- లోక్‌సభ పరిధిలోని ఐదు సెగ్మెంట్లలో - గులాబీ గుబాళింపు ఎంపీలు, ఎమ్మెల్యేలకు తగ్గని మెజార్టీ సత్తాచాటిన టీఆర్ఎస్ ప్రస్తుత ఎన్నికల్లో ఎంపీగా టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన డాక్టర్ బూరనర్సయ్యగౌడ్కు 4,48,245 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి రాజ గోపాల్‌రెడ్డికి 4,17.751 ఓట్లు పడడంతో టీఆర్ఎస్ అభ్యర్థికి 39, 494 ఓట్ల మెజార్టీ వచ్చింది. అయితే అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో టీఆర్ఎస్కు ఐదు సెగెంట్లలో 3,38,746 ఓట్లు సాధించారు. మునుపెన్నడూ లేనివిధంగా టీఆర్ఎస్ ప్రభంజనం వీచడంతో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, బీజేపీ, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. జిల్లాలో టీఆర్ఎస్ తన సత్తాను చాటుకుంది. భువనగిరి, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ స్పష్టమైన మెజార్టీతో దూసుకుపోయింది.పార్లమెంట్ పరిధిలోకి వచ్చే భువనగిరి, ఆలేరు, మునుగోడు, తుంగతుర్తి, నకిరేక ల్ నియోజకవర్గాల్లో కారు టాప్‌గేర్ స్పీడుకు హస్తం బ్రేక్ వేయలేకపోయింది. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్కు పట్టున్న ఆలేరుతోపాటు మిగతా నాలుగు నియోజకవర్గాల్లో కారు స్పీడు జోరందుకుంది. తొలిసారి జరి గిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ గుబాళించింది. జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్ స్థానాలను భువనగిరి డివిజన్లో మెజార్టీగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆలేరులో టీఆర్ఎస్ తొలిసారిగా విజయం సాధించింది. ఉప ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ తరుపున డాక్టర్ నగేష్ గెలిచారు. 2009 ఎన్నికల్లో ఐదు నియోజకవర్గాల్లో ఆలేరు, నకిరేకల్, నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. తుంగతుర్తి, భువనగిరిలో టీడీపీ, మునుగోడులో సీపీఐ మహా కూటమి అభ్యర్థులు విజయం సాధిం చారు. ఆ ఎన్నికల్లో భువనగిరి లోక్‌సభ స్థానానికి మ హా కూటమి అభ్యర్థి నోముల నర్సింహయ్యపై కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భారీ ఆధిక్యంతో విజయం సాధించారు. -
సైకిల్ జిల్లాలో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ
- పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి ఈ పరిస్థితి - నిరాశ పరిచిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలు - చేదు జ్ఞాపకాలను మిగిల్చిన 2014 సార్వత్రిక ఎన్నికలు - ఇక.. చెట్టుకొకరు.. పుట్టకొకరేనా..! సాక్షిప్రతినిధి, నల్లగొండ, అంతా ఊహించిందే జరిగింది. తెలుగుదేశం పార్టీ జిల్లాలో నామరూపాల్లేకుండా పోయింది. శుక్రవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి మరణశాసనంగా పరిణమించాయి. తెలంగాణ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన రెండు కళ్ల సిద్ధాంతమే ఈ ఫలితాలకు కారణమన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. జిల్లాలో ఎనిమిది అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానంలో టీడీపీ పోటీ చేసింది. మరో నాలుగు స్థానాలతో పాటు, ఒక లోక్‌సభ స్థానాన్ని బీజేపీకి వదిలేసింది. మొదటి నుంచీ దేవరకొండ, కోదాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తుందన్న ప్రచారం జోరుగా సాగినా, ఆ రెండు చోట్లా ద్వితీయ స్థానానికే పరిమితమైంది. ఇక, గత ఎన్నికల్లో పార్టీ ప్రాతినిధ్యం వహించిన భువనగిరి, తుంగతుర్తిలతోపాటు కోదాడలో టీడీపీ ఓటమి పాలైంది. భువనగిరిలో మూడు పర్యాయాలు వరుసగా విజయం సాధించిన ఉమా మాధవరెడ్డికి ఈసారి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. తుంగతుర్తిలో మూడో స్థానానికే టీడీపీ పరిమితమైంది. ఈ ఎన్నికల్లో ఎనిమిది చోట్ల పోటీ చేసినా టీడీపీ మొత్తం పోలైన ఓట్లలో 2,90,529ఓట్లను మాత్రమే పొందింది. నల్లగొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆ పార్టీ 2,78,937 ఓట్లు (ఏడు సెగ్మెంట్లు కలిపి) పొందింది. మొత్తం పోలైన ఓట్లలో టీడీపీ సాధించిన ఓటు షేరు స్వల్పంగానే ఉంది. అయితే, కేవలం సార్వత్రిక ఎన్నికల్లోనే టీడీపీ తలబొప్పి కట్టలేదు. అంతకుముందు వెలువడిన మున్సిపల్, స్థానిక ఎన్నికల ఫలితాలూ అంతే స్థాయిలో టీడీపీకి నిరాశ మిగిల్చాయి. ఒక్క మున్సిపల్ చైర్మన్ స్థానాన్నీ గెలుచుకోలేకపోయిన టీడీపీ.. వార్డు కౌన్సిలర్ల స్థానాలనూ తక్కువ సంఖ్యలోనే గెలుచుకుంది. ఇక, స్థానిక ఎన్నికల్లో కేవలం రెండు జెడ్పీటీసీ స్థానాలు, రెండు మండలాల పరిషత్‌కే పరిమితమైంది. ఈ ఫలితాలను విశ్లేషించుకున్న మీదట జిల్లాలో తమ పార్టీ పరిస్థితి ఏమిటన్నదని అంతుబట్టడం లేదన్న ఆవేదన టీడీపీ కార్యక ర్తల్లో వ్యక్తమైంది. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న సమయంలోనే గ్రూపులతో కొట్టుకు చచ్చిన టీడీపీ నేతలు ఇక, క్రియాశీలకంగా వ్యవహరిస్తారని చెప్పలేమన్న అభిప్రాయం వ్యక్తమవుతోoది. -
రైలు చార్జీలు పెంపు... వెంటనే వెనకడుగు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ప్రయాణికులు, సరుకు రవాణా చార్జీలను పెంచుతూ రైల్వే శాఖ పిడుగులాంటి నిర్ణయం తీసుకుంది. అయితే, అంతలోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. తొలుత రైల్వే శాఖ అన్ని తరగతుల ప్రయాణికుల టికెట్ చార్జీలను 10 శాతం పెంచేసింది. ఇంధన సర్దుబాటు (ఎఫ్ఏసీ) కింద మరో 4.2 శాతం భారం మోపింది. దీంతో మొత్తం 14.2 శాతం మేర చార్జీలు పెరిగాయి. అలాగే, సరుకు రవాణాపై 6.5 శాతం(ఎఫ్‌ఏసీతో కలుపుకుని) పెంచింది. పెరిగిన చార్జీలు ఈ నెల 20 నుంచి అమల్లోకి రానున్నట్లు నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే, ఎన్నికల ఫలితాల రోజు చార్జీలను పెంచడంపై విమర్శలు వ్యక్తం కావడంతో పెంపు నిర్ణయాన్ని నూతన ప్రభుత్వానికి విడిచిపెట్టాలని రైల్వే మంత్రి మల్లికార్జునఖర్గే ఆదేశించారు. -
ఆబ్సెంట్...ప్లీజ్!