
నేడు విశాఖకు వైఎస్ జగన్
‘సార్వత్రిక ఎన్నికల ఫలితాల’పై రెండు రోజులపాటు సమీక్ష
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విశాఖపట్నం వెళుతున్నారు. అక్కడ ఆయన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై బుధ, గురువారాల్లో జరిగే పార్టీ సమీక్ష సమావేశాల్లో పాల్గొంటారు. బుధవారం తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు.