
ప్రతిపక్షం నుంచే పోరాడదాం: వైఎస్ జగన్
విశాఖ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రజలకు మోసపూరితమైన హామీలు ఇచ్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఆయన బుధవారం సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించారు. గ్రామస్థాయి నుంచే క్యాడర్ను బలోపేతం చేయాడానికి అందరూ కృషి చేయాలని జగన్ ఈ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం నుంచే పోరాడదామని ఆయన అన్నారు.
విశ్వప్రియ ఫంక్షన్‌హాల్‌లో జరుగుతున్న ఈ సమీక్షలో తొలి రోజున విశాఖపట్నం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లతోపాటు గతవారం రాజమండ్రిలో జరిగిన సమీక్ష సందర్భంగా మిగిలిపోయిన జగ్గంపేట, కాకినాడ నియోజకవర్గాలపైనా జగన్ సమీక్ష జరుపుతారు. 12వ తేదీన అనకాపల్లి లోక్‌సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తారు.