ఫైల్ ఫోటో
సాక్షి, విశాఖపట్నం: అమరావతిలో పెద్ద ఎత్తున భూ అక్రమాలకు పాల్పడిన కారణంగానే విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటును టీడీపీ నాయకులు వ్యతిరేకిస్తున్నారని విశాఖ ఉత్తర నియోజకవర్గం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ కేకే రాజు పేర్కొన్నారు. అమరావతి రాజధానిగా ప్రతిపాదించడానికి ముందే చంద్రబాబు నాయుడు అండ్ కో వేల ఎకరాల భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేసి పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిందని అన్నారు. దీనిపై అవినీతి నిరోధక శాఖ లోతుగా విచారణ జరిపితే చంద్రబాబు నాయుడుతో పాటు అతని అనుచరుల గుట్టు రట్టు అవుతుందని తెలిపారు. ('అవినీతికి, అక్రమాలకు చంద్రబాబు పెట్టింది పేరు')
అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో టీడీపీ బినామీల బాగోతాలు సీబీఐ విచారణతోనే నిగ్గుతేలతాయని విశాఖ పశ్చిమ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మళ్ల విజయప్రసాద్ అన్నారు. ఎన్‌ఏడి జంక్షన్‌లో మంగళవారం రోజున వైఎస్సార్ ఆసరా వారోత్సవాల్లో మళ్ల విజయప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధానిలో భూ అక్రమాలు జరిగాయని వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి చెప్తూనే ఉంది. అమరావతి ముద్దు.. విశాఖ వద్దు అంటున్న చంద్రబాబు ఇక్కడున్న నలుగురు ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలి.
Comments
Please login to add a commentAdd a comment